హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ముందు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేన్ విలియమ్సన్ (156) సెంచరీతో కదంతొక్కడంతో న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 658 పరుగులు చేయాలి.
న్యూజిలాండ్ భారీ స్కోర్
కేన్ విలియమ్సన్‌తో పాటు విల్ యంగ్ (60), డారిల్ మిచెల్ (60), రచిన్ రవీంద్ర (44), టామ్ బ్లండెల్ (44 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (49) రాణించడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. విలియమ్సన్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ టెయిలెండర్లు వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేకబ్ బేతెల్ 3, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ చెరో 2, పాట్స్, అట్కిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జాక్ క్రాలే (21), బెన్ డకెట్ (11), జేకబ్ బేతెల్ (12), ఓలీ పోప్ (24), బెన్ స్టోక్స్ (27) రెండంకెల స్కోర్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్ 4, అట్కిన్సన్ 3, బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment