టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఓ పోడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి భారత పర్యటనలో విరాట్ కోహ్లి తనపై ఉమ్మివేసాడని ఎల్గర్ ఆరోపించాడు. ఆ సంఘటన జరిగిన రెండు ఏళ్ల తర్వాత కోహ్లి తనకు క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ తెలిపాడు. కాగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఎల్గర్.. 2015 తొలిసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో విరాట్ కోహ్లి టీమిండియా ఫుల్‌టైమ్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
"అది భారత్‌లో నా తొలి పర్యటన. మొదటి టెస్టులో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. విరాట్ కోహ్లిని ప్రత్యక్షంగా చూడటం కూడా అదే తొలి సారి. అక్కడ పిచ్‌ను చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆ వికెట్‌పై ఆడటం నాకు పెద్ద సవాలుగా మారింది. టర్నింగ్ వికెట్‌పై అశ్విన్, జడేజాను ఎదుర్కొవడం కష్టంగా మారింది. అంతేకాకుండా వారిద్దరూ నన్ను స్లెడ్జ్ చేయడం మొదలు పెట్టారు.
ఈ సమయంలో కోహ్లి నాపై ఉమ్మివేశాడు. వెంటనే నా బాషలో ఓ అసభ్య పదజాలం వాడి బ్యాట్‌తో కొడతానని అన్నాను. నేను మాట్లాడిన బాష కోహ్లి అర్ధమైంది అనుకునున్నాను. ఎందుకంటే అప్పటికే అతడు ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు.
నేను బూతు పదం వాడిన తర్వాత కోహ్లి కూడా అదే పదాన్ని వాడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. అతడు అరుస్తునే ఉంటాడని పట్టించుకోవడం మానేసాను. ఎందుకంటే మేము భారత్‌లో ఉన్నాము కాబట్టి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఎబి డివిలియర్స్ సైతం కోహ్లిని ప్రశ్నించాడు.
అనంతరం రేండేళ్ల తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లి నాకు ఫోన్ చేశాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? నేను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. నేను అందుకు అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు మేమిద్దరం డ్రింక్ చేస్తునే ఉన్నామని'బాంటర్ విత్ బాయ్స్' అనే ఈ పోడ్ కాస్ట్‌లో ఎల్గర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment