భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న నోర్జే కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా నోర్జే గాయపడ్డాడు. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను వెంటనే జొహన్నస్‌బర్గ్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ పంపింది. ఈ క్రమంలో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. కాగా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటిస్ జట్టులో నోర్జే కూడా భాగంగా ఉన్నాడు.
నోర్జే దూరమైతే దక్షిణాఫ్రికాకు మాత్రం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ మెగా టోర్నీకి ఎంపికైన ప్రోటీస్ పేసర్ సిసంద మగల సైతం మోకాలి గాయంతో భాదపడుతున్నాడు. అయితే అతడు వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక మెగా ఈవెంట్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పాపా’ అంటూ!
Comments
Please login to add a commentAdd a comment