India Test Record In South africa: దక్షిణాఫ్రికాతో తొలి పోరుకు భారత్ సిద్దమైంది. ఆదివారం( డిసెంబర్26) నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్(బ్యాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ క్రమంలో తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో సఫారీ గడ్డపై భారత్ సాధించిన రికార్డులెంటో ఓ లుక్కేద్దాం.
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే
► దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు సాధించిన టెస్టు విజయాల సంఖ్య. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు మొత్తం 20 టెస్టులు ఆడింది. 10 టెస్టుల్లో ఓడిపోయి, ఏడు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.
► దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు టెస్టు విజయాలను అందించిన కెప్టెన్లు. 2006లో రాహుల్ ద్రవిడ్... 2010లో ధోని... 2018లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఒక్కో టెస్టులో విజయం రుచి చూసింది.
► సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా గెలిచిన టెస్టుల సంఖ్య. ఈ వేదికపై దక్షిణాఫ్రికా మొత్తం 26 టెస్టులు ఆడింది. రెండు టెస్టుల్లో ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు సెంచూరియన్‌లో గతంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత్ ఓడిపోయింది.
చదవండి: Hardik Pandya: అభిమానితో హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment