Test Record
-
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే..
India Test Record In South africa: దక్షిణాఫ్రికాతో తొలి పోరుకు భారత్ సిద్దమైంది. ఆదివారం( డిసెంబర్26) నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్(బ్యాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ క్రమంలో తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో సఫారీ గడ్డపై భారత్ సాధించిన రికార్డులెంటో ఓ లుక్కేద్దాం. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే ► దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు సాధించిన టెస్టు విజయాల సంఖ్య. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు మొత్తం 20 టెస్టులు ఆడింది. 10 టెస్టుల్లో ఓడిపోయి, ఏడు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. ► దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు టెస్టు విజయాలను అందించిన కెప్టెన్లు. 2006లో రాహుల్ ద్రవిడ్... 2010లో ధోని... 2018లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఒక్కో టెస్టులో విజయం రుచి చూసింది. ► సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా గెలిచిన టెస్టుల సంఖ్య. ఈ వేదికపై దక్షిణాఫ్రికా మొత్తం 26 టెస్టులు ఆడింది. రెండు టెస్టుల్లో ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు సెంచూరియన్‌లో గతంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత్ ఓడిపోయింది. చదవండి: Hardik Pandya: అభిమానితో హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్ -
ధోని రికార్డును దాటేసిన పంత్
కింగ్స్టన్ (జమైకా): సెలక్టర్లు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు యువ క్రికెట్ రిషబ్ పంత్. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నిరూపించుకుంటున్నాడు. 11వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పంత్.. ధోని రికార్డును అధిగమించి తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 ఔట్లు చేసిన భారత వికెట్ కీపర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 11 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును రిషబ్ పంత్ ఇంతకుముందే బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్ కీపర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌తో పాటు టెస్టుల్లోనూ రాణించగలనని పంత్ నిరూపించుకుంటున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్) -
కోహ్లి ఇంకొక్కటి కొడితే..
అంటిగ్వా: టీమిండియా సారథి విరాట్ కోహ్లి క్రికెట్లో పరుగులతో పాటు రికార్డుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే మహామహులకు సాధ్యంకాని రికార్డులను కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి మరో అరుదైన రికార్డుపై గురిపెట్టాడు. ఈ సిరీస్‌లో ఒక్క శతకం సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సారథిగా పాంటింగ్(19) రికార్డును కోహ్లి సరి చేస్తాడు. ప్రస్తుతం కోహ్లి 18 సెంచరీలతో పాంటింగ్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా సారథి గ్రేమ్ స్మిత్(25) తొలి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో కోహ్లి 25 శతకాలు సాధించాడు. ఇందులో సారథిగా 18 శతకాలు సాధించడం విశేషం. ఇక ఇలాంటి పరిస్థితే వన్డేల్లోనూ నెలకొంది. సారథిగా పాంటింగ్ 22 శతకాలు సాధిస్తే.. కోహ్లి 21 సెంచరీలతో కొనసాగుతున్నాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన సారథిగా ధోని రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు. ఇప్పటివరకు కోహ్లి 46 టెస్టులకు సారథ్యం వహించగా 26 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. గతంలో ధోని కెప్టెన్సీలో 60 టెస్టుల్లో 27 విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్ సిరీస్‌తోనే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌ను టీమిండియా ఆరంభించనుంది. ఇప్పట్నుంచి టీమిండియా ఆడే ప్రతీ టెస్టు కీలకం కానుంది. టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా 2021 జూన్ వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. -
అఫ్గాన్ సరికొత్త చరిత్ర
డెహ్రాడూన్: అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొమ్మిది నెలల్లోనే అఫ్గానిస్థాన్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడిన రెండో టెస్ట్‌లోనే విజయం సాధించిన మూడో జట్టుగా ఖ్యాతికెక్కింది. దీంతో తాము ఆడిన రెండో మ్యాచ్‌లోనే గెలుపును అందుకొని ఈ ఘనత సాధించిన పాకిస్థాన్, ఇంగ్లండ్ సరసన నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాత్రమే ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది. ఇక ఐర్లాండ్‌తో సోమవారం ముగిసిన ఏకైన టెస్ట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 7 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. 147 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 29/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గాన్.. రహ్మత్ షా(76), ఇషానుల్లా(65 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. విజయానికి మరో నాలుగు పరుగులు అవసరమైన దశలో రహ్మత్, నబి(1) వరుస బంతుల్లో వెనుదిరిగినప్పటికీ ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించిన షాహిది(4నాటౌట్) తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. అఫ్గాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీలతో రాణించిన రహ్మత్ షాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 172, అఫ్గాన్ 314కు ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 288 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల అఫ్గాన్ ఎదుట 147 పరుగుల సాధారణ లక్ష్యమే లభించింది. కాగా, తొమ్మిది నెలల కిందట భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన అఫ్గనిస్థాన్ టెస్ట్ క్రికెట్లోకి ప్రవేశించింది. ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ అనంతరం వన్డే, టీ20 ఫార్మాట్లలో వేగంగా ఎదిగిన అఫ్గాన్ తాజా గెలుపుతో టెస్ట్ క్రికెట్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. -
సచిన్ రికార్డులపై కన్నేసిన కోహ్లి
హైదరాబాద్: క్రికెట్ రికార్టులు తిరగరాయటమే అలవాటుగా మార్చుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి మరిన్ని రికార్డులపై కన్నేశాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డును సాధించేందుకు టీమిండియా పరుగుల యంత్రం కోహ్లి మరో రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆసీస్‌లో ఐదు టెస్టు శతకాలు సాధించి లెజండర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సిరీస్‌లో మరో రెండు సెంచరీలు సాధిస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(6) రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇక క్రికెట్ గాడ్ టెస్టుల్లో ఆసీస్‌లో సాధించిన పరుగుల రికార్డును కూడా కోహ్లి తిరగరాసే అవకాశం ఉంది. సచిన్ ఆసీస్ పిచ్‌లపై 20 టెస్టుల్లో 1809 పరుగుల సాధించగా.. కోహ్లి ఎనిమిది టెస్టుల్లోనే 992 పరుగులు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లో మరో 817 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డును అధిగమిస్తాడు. భీకరఫామ్‌లో ఉన్న టీమిండియా రన్ మిషన్ ఈ రికార్డులు సాధించడం సులువే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (205) పది వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే. -
‘టీమిండియాకు ఆడతాడని పదేళ్ల క్రితమే చెప్పా’
సాక్షి, ముంబై : టీమిండియా తరుపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. మంచి పుట్‌వర్క్, టెక్నిక్ కలిగిన షాను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతున్నారు అభిమనాలు. పాఠశాల జట్టు రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు.. అరంగేట్ర ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో శతకం.. తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ చేయడంతో అందరి దృష్టి షా పై పడింది. ఇక క్రీడా పండితులు, అభిమానులు టీమిండియాకు మరో సచిన్ దొరికాడని సంతోష పడుతున్నారు. అయితే యువ సంచలన ఆటగాడిపై, అతడి ఆటపై క్రికెట్ గాడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పృథ్వీ ‘షా’న్దార్ ) అదే అతడి బలం ‘అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం చేయడం ఏ క్రికెటర్‌కైనా దానికి మించిన కెరీర్ ఆరంభం, ఉపశమనం ఇంకొకటి ఉండదు. ఇక నుంచి అతను మరింత ఫ్రీగా ఆడగలడు. ప్రతి ఒక్కరికీ అనుమానం ఉండేది. డొమెస్టిక్ క్రికెట్లో రాణించాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో రాణించగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ పృథ్వీ షా తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఇక ప్రతి ఒక్క ఆటగాడికి ప్రతిభ ఉంటుంది. కానీ దానిని సరైన రీతిలో, అవకాశాలకు తగ్గట్లుగా ఉపయోగించుకోవాలి. ప్రతీ ఆటగాడు నిత్య విద్యార్థిలా ఉండాలి అదేవిధంగా త్వరగా నేర్చుకునే తత్వం ఉండాలి. అది పృథ్వీషాలో అధికంగా ఉంది. పరిస్థితులను, క్లిష్ట సమయాన్ని ఆకళింపు చేసుకుని ఎదుర్కొనే సత్తా ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం షాలో ఎక్కువగానే ఉంది. దీంతో అతను విదేశాల్లో కూడా రాణించగలడు. (నాన్నకు ప్రేమతో.. : పృథ్వీ షా) పదేళ్ల క్రితమే పసిగట్టా పదేళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా షా నన్ను కలిశాడు. అప్పటికే చాలా చిన్నోడు. కానీ షా అతడి ఆట గురించి వివరిస్తూ, సూచనలు అడిగి తెలుసుకున్న విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడే నా స్నేహితుడితో చెప్పా.. ఈ కుర్రాడు టీమిండియాకు ఎప్పటికైనా ఆడతాడు. ఆ సత్తా అతడిలో ఉందని చెప్పా. ఆ వయసులోనే ఎంతో ట్యాలెంట్, బ్యాటింగ్‌లో సమన్వయం, లైన్ అండ్ లెంగ్త్ పట్ల ఉన్న అవగాహను చూసి షాక్ అయ్యాను. హి ఇజ్ రియల్లీ ట్యాలెంటెడ్ గాయ్’అంటూ సచిన్ పృథ్వీ షాపై ప్రశంసలు జట్లు కురిపించాడు. (షాను అప్పుడే సెహ్వాగ్‌తో పోల్చొద్దు: గంగూలీ) -
ఎదురులేని జిమ్మీ.. ఆసీస్ బౌలర్ రికార్డు బ్రేక్
లండన్: నిప్పులు చెరిగే వేగం.. పచ్చని పిచ్‌పై బుల్లెట్లా దూసుకొచ్చే బంతులు... కళ్లు చెదిరే స్వింగ్.. ముట్టుకుంటే బ్యాట్‌ను ముద్దాడుతూ గాల్లోకి లేచే బంతి. ఈ మాటలన్నీ ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కు సరితూగుతాయి. కోహ్లి సేన టెస్టు సిరీస్ ఓడిపోవడానికి జిమ్మీ కూడా ముఖ్య కారణం. టీమిండియా బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకున్నారని భావించిన ప్రతీసారి ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్ అండర్సన్ చేతికి బంతిని అప్పగించే వాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రతీసారి నిలబెట్టుకున్నాడు అండర్సన్. ఈ సిరీస్‌లో తాను ఎందుకు నంబర్ వన్ బౌలరో ప్రపంచానికి చాటి చెప్పాడు. అండర్సన్ బౌలింగ్ ధాటికి వికెట్లు, రికార్డులు తన ఖాతాలో వచ్చి చేరాయి. ఓవల్ మైదానంలో భారత్ పేసర్ మహ్మద్ షమీ వికెట్ తీయడంతో టెస్టులో అత్యధిక వికెట్లు(564) తీసిన పేస్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్(563) రికార్డును సవరించాడు. ఇక ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు మురళీథరన్(800), ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(708), టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(619) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 2003లో జింబాబ్వేపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్ అనతికాలంలోనే ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అండర్సన్ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
‘అతడు లేడు కాబట్టే కోహ్లియే నంబర్‌వన్’
తమ దేశ ఆటగాళ్లు తప్పా ఇతర ఆటగాళ్లు రికార్డులు సాధిస్తే ఆస్ట్రేలియాకు నచ్చదనే విషయం మరోసారి రుజువైంది. ఆసీసీ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఆకాశానికి ఎత్తుతూనే నేలకు దించాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ ఆడటం లేదు కాబట్టి కోహ్లియే ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. బాల్ ట్యాంపరింగ్‌తో అడ్డంగా బుక్కయిన స్మిత్ ఏడాది నిషేధానికి గురైన విషయం తెలిసిందే. నిషేధం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు స్మిత్ దూరమయ్యాడని లేకుంటే అతడే నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అంటూ పాంటింగ్ కితాబిచ్చాడు. గత యాషెస్‌లో స్మిత్ అద్భుతంగా రాణించాడని పాంటింగ్ ప్రశంసించాడు. కోహ్లి బ్యాటింగ్ సగటు స్వదేశంలోనే ఎక్కువగా ఉందని, విదేశీ పిచ్‌లపై అతడు రాణించలేడని విమర్శించాడు. స్మిత్ విదేశీ పిచ్‌లపై కూడా ఘనమైన రికార్డులు ఉన్నాయని పేర్కొన్నాడు. వన్డేల్లో స్మిత్ కంటే కోహ్లి అత్యధిక సెంచరీలు సాధించినా.. బ్యాటింగ్ సగటు స్మిత్‌దే ఎక్కువగా ఉందని వివరించాడు. స్మిత్ వచ్చే వరకు కోహ్లియే టెస్టుల్లో నంబర్ వన్ ఆ తర్వాత నంబర్ టూకు పడిపోతాడని జోస్యం చెప్పాడు. 12 నెలల నిషేధం అనంతరం స్మిత్ ఆసీస్ సారథ్య పగ్గాలు చేపట్టి జట్టుకు పూర్వ వైభవం తీసుకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియాతో సిరీస్‌పై.. ఆసీస్ గడ్డపై టీమిండియా ఎన్నటికీ టెస్టు సిరీస్ గెలవదని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో 1947 నుంచి ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య పదకొండు సిరీస్‌లు జరిగాయని, ఏ ఒక్కటి టీమిండియా గెలవలేదని గుర్తు చేశాడు. ఆసీస్‌లో తమపై భారత్ 44 టెస్టులు ఆడగా కేవలం ఐదు మాత్రమే గెలిచిందని పాంటింగ్ వివరించాడు. -
అఫ్గాన్ టెస్ట్: అశ్విన్ రికార్డు
సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ముందుగా బ్యాట్స్‌మెన్ చెలరేగగా, అనంతరం బౌలర్లు చకచకా వికెట్లు తీస్తు విజయాన్ని దగ్గర చేస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ఇక ఈ చారిత్రక టెస్ట్‌లో పలు రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా ఆటగాళ్లు, తాజాగా భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలు రాయిని అందుకున్నాడు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో అస్గార్ స్టానిక్జాయ్ వికెట్ తీసి.. తద్వారా భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్(92 టెస్టుల్లో 311 వికెట్లు) రికార్డును అధిగమించాడు. అశ్విన్ 58 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించటం విశేషం. 100 వికెట్ల క్లబ్లో ఉమేశ్ యాదవ్ టీమిండియా పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షాను ఔట్ చేయడంతో టెస్ట్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఈ ఘనత సాధించాడు. 37 టెస్టుల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు: అనిల్ కుంబ్లే- 619 వికెట్లు (132 టెస్టుల్లో) కపిల్ దేవ్ - 434 వికెట్లు (131 టెస్టుల్లో) హర్భజన్‌సింగ్- 417 వికెట్లు (103 టెస్టుల్లో) అశ్విన్-315 వికెట్లు (ప్రస్తుతానికి) (58 టెస్టుల్లో) జహీర్‌ఖాన్-311 వికెట్లు (92 టెస్టుల్లో) -
టెస్టు చరిత్రలో స్పెషల్ రికార్డు
హైదరాబాద్: టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేయడమే అరుదు. అటువంటిది వరుసగా నలుగురు ఆటగాళ్ల శతకాలతో ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేస్తే ఎలా ఉంటుంది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత జట్టు రికార్డును నమోదు చేసిన సందర్భంగా ఆ మ్యాచ్‌ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓపెనర్లు దినేష్ కార్తీక్(129), వసీం జాఫర్(138) శతకాలతో మెరవగా, ఆ పై వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ద్రావిడ్(129) సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ సచిన్(122)లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ లో మరో విశేషమేమిటంటే... 175 పరుగుల వద్ద కార్తీక్ గాయంతో రిటైర్డ్ అవుట్‌గా మైదానం వీడగా క్రీజులో ఉన్న జాఫర్ ద్రావిడ్‌తో ఆడుతూ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్ కూడా గాయంతో రిటైర్ట్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్, ద్రావిడ్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలివికెట్ కు 408 పరుగులు చేసింది. ద్రావిడ్ అవుటవ్వడంతో వినూమన్కడ్-పంకజ్ రాయ్ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్ సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్ శర్మకు తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. -
రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ కెప్టెన్
చిట్టగాంగ్: ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టులాడిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో బరిలోకి దిగి అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. 133 టెస్టులాడిన అలెక్ స్టివార్ట్ రికార్డును అతడు అధిగమించాడు. కుక్ 31 ఏళ్లకే ఈ రికార్డు సాధించడం విశేషం. ఇంగ్లాండ్ తరఫున టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు కూడా అతడే. 47.31 సగటుతో అతడు ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 294. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడి అందరికంటే ముందున్నాడు. రికీ పాంటింగ్, స్టీవా(168) తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో కుక్ 11వ స్థానంలో ఉన్నాడు. కాగా, చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుక్ కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు.