మైదానంలో రిషబ్ పంత్ విన్యాసం
కింగ్‌స్టన్ (జమైకా): సెలక్టర్లు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు యువ క్రికెట్ రిషబ్ పంత్. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నిరూపించుకుంటున్నాడు. 11వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పంత్.. ధోని రికార్డును అధిగమించి తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 ఔట్‌లు చేసిన భారత వికెట్ కీపర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 11 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును రిషబ్ పంత్ ఇంతకుముందే బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్ కీపర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌తో పాటు టెస్టుల్లోనూ రాణించగలనని పంత్ నిరూపించుకుంటున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్)
Comments
Please login to add a commentAdd a comment