
సాక్షి, ముంబై : టీమిండియా తరుపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. మంచి పుట్‌వర్క్, టెక్నిక్ కలిగిన షాను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతున్నారు అభిమనాలు. పాఠశాల జట్టు రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు.. అరంగేట్ర ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో శతకం.. తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ చేయడంతో అందరి దృష్టి షా పై పడింది. ఇక క్రీడా పండితులు, అభిమానులు టీమిండియాకు మరో సచిన్ దొరికాడని సంతోష పడుతున్నారు. అయితే యువ సంచలన ఆటగాడిపై, అతడి ఆటపై క్రికెట్ గాడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పృథ్వీ ‘షా’న్‌దార్ )
అదే అతడి బలం
‘అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం చేయడం ఏ క్రికెటర్‌కైనా దానికి మించిన కెరీర్ ఆరంభం, ఉపశమనం ఇంకొకటి ఉండదు. ఇక నుంచి అతను మరింత ఫ్రీగా ఆడగలడు. ప్రతి ఒక్కరికీ అనుమానం ఉండేది. డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ పృథ్వీ షా తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఇక ప్రతి ఒక్క ఆటగాడికి ప్రతిభ ఉంటుంది. కానీ దానిని సరైన రీతిలో, అవకాశాలకు తగ్గట్లుగా ఉపయోగించుకోవాలి. ప్రతీ ఆటగాడు నిత్య విద్యార్థిలా ఉండాలి అదేవిధంగా త్వరగా నేర్చుకునే తత్వం ఉండాలి. అది పృథ్వీషాలో అధికంగా ఉంది. పరిస్థితులను, క్లిష్ట సమయాన్ని ఆకళింపు చేసుకుని ఎదుర్కొనే సత్తా ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం షాలో ఎక్కువగానే ఉంది. దీంతో అతను విదేశాల్లో కూడా రాణించగలడు. (నాన్నకు ప్రేమతో.. : పృథ్వీ షా)
పదేళ్ల క్రితమే పసిగట్టా
పదేళ్ల క్రితం నా స్నేహితుడి ద్వారా షా నన్ను కలిశాడు. అప్పటికే చాలా చిన్నోడు. కానీ షా అతడి ఆట గురించి వివరిస్తూ, సూచనలు అడిగి తెలుసుకున్న విధానం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడే నా స్నేహితుడితో చెప్పా.. ఈ కుర్రాడు టీమిండియాకు ఎప్పటికైనా ఆడతాడు. ఆ సత్తా అతడిలో ఉందని చెప్పా. ఆ వయసులోనే ఎంతో ట్యాలెంట్, బ్యాటింగ్‌లో సమన్వయం, లైన్ అండ్ లెంగ్త్ పట్ల ఉన్న అవగాహను చూసి షాక్ అయ్యాను. హి ఇజ్ రియల్లీ ట్యాలెంటెడ్ గాయ్’అంటూ సచిన్ పృథ్వీ షాపై ప్రశంసలు జట్లు కురిపించాడు. (షాను అప్పుడే సెహ్వాగ్‌తో పోల్చొద్దు: గంగూలీ)
Comments
Please login to add a commentAdd a comment