రెండో టీ20లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ మనీష్ పాండే
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మాన్ మనీష్ పాండే( 79, 48 బంతుల్లో 3సిక్స్‌లు, 6 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్, ప్రత్యర్థికి 189 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించగలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేనకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే ధావన్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూ ప్రకటించగా.. రివ్యూ కోరి ధావన్ గట్టెక్కాడు. అనంతరం ఎదుర్కొన్న ఐదు బంతులను బ్యాట్‌కు తగిలించడానికి ధావన్ తెగ ఇబ్బంది పడ్డాడు. దీంతో తొలి ఓవర్‌లో భారత్ పరుగుల ఖాతా తెరవలేకపోయింది. డాలా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మ డకౌటవ్వడంతో భారత్ పరుగులేమి చేయకుండానే వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా, ధావన్‌లు ధాటిగా ఆడి రన్‌రేట్‌ను పరుగెత్తించారు. ఈ తరుణంలో ధావన్(24: 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి(1) నిరాశపరిచాడు. తర్వాత వచ్చిన పాండే, సురేశ్ రైనాలు చెలరేగడంతో భారత్ 10 ఓవర్లు ముగిసే సరికి 86 పరుగులుచేసింది. అనంతరం జట్టు స్కోరు 90 పరుగుల వద్ద రైనా(31: 24 బంతులు,5ఫోర్లు) ఎల్బీడబ్యూగా అవుటయ్యాడు. చివర్లో మనీష్‌పాండే, ధోనీ(52, 28 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో వికెట్ కోల్పోయి 103 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment