చిరుత పులి పేరు వినగానే మనకు తెలుపు, నలుపు, గోధుమ రంగు వర్ణంలో ఉంటుందని తెలుసు. మన ఊహే కాదు.... వాస్తవంగా కూడా చిరుత పులి అలాగే వుంటుంది కదా అనుకుంటున్నారా? అయితే ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారిన ఈ చిరుత ఫోటోలు చూసేయండి మరి. స్ట్రాబెర్రి పండు చారలతో బంగారు వర్ణంలో ఉన్న అరుదైన ఈ చిరుత పేరు స్ట్రాబెర్రి లిమోపార్డ్ లేదా ఎరిథ్రిస్ట్రక్. ఇది ప్రపంచంలోనే అరుదైన రంగు చిరుత. దక్షిణాఫ్రికాకు చెందిన అలాన్ వాట్సాన్ అతని భార్య లిన్సే,బ్లాక్ లిపార్డ్ మౌంటైన్ లాడ్జ్ దీన్ని వారి కెమెరాలో బంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిరుత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దాదాపు 3 వేలకు పైగా కామెంట్లు, రెండు వేలకు పైగా షేర్‌లు వచ్చాయి.
‘నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే అరుదైన రంగు చిరుత’ అని వాట్సాన్ ఓ పత్రికతో తెలిపాడు. వివిధ జాతి పులులు అంతరించిపోతున్న సమయంలో ‘మేము నమ్మశక్యంగా లేని అరుదైన రంగు చిరుతను చూశామంటూ ఆ జంట ఫేస్ బుక్‌లో వారి అనుభవాన్ని పంచుకున్నారు. చనిపోయిన జిరాఫీ కళేబరాన్ని తింటున్న చిరుత ఫొటోలకు నెటిజన్లంతా ‘నేను ఇంతకు ముందు ఇలాంటి చిరుతను చూడలేదు’, ‘అద్భుతమైన ఫొటో ఇది.. దీనిని షేర్ చేసినందుకు ధన్యవాదాలు’, ‘ ఇలాంటి అరుదైన రంగు, జాతి జంతువులను సురక్షితంగా ఉంచండి’ అంటూ చిరుత పులి(ఎరిథ్రిస్ట్రక్) పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment