
బస్సు గుద్దేసినా దులిపేసుకొని బార్‌లోకెళ్లాడు
లండన్: సహజంగా ఏదైనా వాహనం దగ్గర నుంచి వేగంగా దూసుకెళితేనా మనకు చెమటలు పట్టేస్తాయి. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని మనసులో అనుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఇంట్లో వారితో సహా ఓ నలుగురితో పంచుకుంటాం. అలాంటిది ఏకంగా బస్సు ఢీకొడితే.. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినా ఆ షాక్‌లో నుంచి అంత తేలికగా బయటకు రాగాలమా.. కానీ, బ్రిటన్‌లో ఓ వ్యక్తి మాత్రం ప్రమాదం జరిగింది బాబోయ్ అని చూసిన వాళ్లు అనుకుంటుండగానే తాఫీగా దులిపేసుకొని ఏం చక్కా బార్ షాపులోకి నడుచుకుంటూ వెళ్లి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
అందులో రికార్డయిన ప్రకారం బ్రిటన్‌లో గత శనివారం కంట్రోల్ తప్పిన ఓ బస్సు రోడ్డు దాటి వస్తున్న ఓ వ్యక్తిని అదుపు తప్పి అమాంతం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కాస్త ఫుట్‌బాల్‌లో గాల్లో ఎగిరి పాదచారుల మార్గంపై పడ్డాడు. బస్సు ధ్వంసం కూడా అయింది. అది చూసిన వారంతా ఓమై గాడ్ అని అతడి వద్దకు పరుగులు తీస్తుండగా అతడే స్వయంగా లేచి ఏదో జారి కిందపడిన వ్యక్తి మాదిరిగా దులిపేసుకొని అందరిమాదిరిగానే అక్కడే ఉన్న బార్ షాపులోకి వెళ్లి ఫుల్లుగా మందేశాడు. ఈ వీడియో కూడా బార్ షాపు సీసీటీవీ కెమెరాలోనే రికార్డయింది.