
రియో డి జనీరా : బ్రెజిల్‌లోని పారా రాష్ట్రంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బెలెమ్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు వ్యక్తులు బార్‌లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు.
ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాల గురించి ఇంకా తెలియలేదని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment