gunman shooting
-
బ్రెజిల్లో కాల్పులు.. 11 మంది మృతి
రియో డి జనీరా : బ్రెజిల్‌లోని పారా రాష్ట్రంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బెలెమ్‌లోని ఓ బార్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు వ్యక్తులు బార్లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాల గురించి ఇంకా తెలియలేదని అధికారులు పేర్కొన్నారు. -
రిపబ్లికన్ నేతపై కాల్పుల కలకలం
► అగ్రనేత స్కేలీస్ సహా ఐదుగురికి గాయాలు వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్ సభ్యులు బేస్‌బాల్ సాధన చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు ఈ ఘాతుకానికి పాల్పడటంతో కనీసం ఐదుగురికి గాయాలయ్యాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్‌బాల్ మైదానంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్తో పాటు మరో ఎంపీ రోజర్ విలియమ్స్ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న ఓ సాయుధుడు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు. ఈ సంఘటనలో తుంటికి గాయం కావడంతో జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్కేలీస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రతినిధుల సభలో విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్కేలీస్‌ను రిపబ్లికన్ల నంబర్.3 నాయకుడిగా పరిగణిస్తారు. 2008లో ఆయన తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సాధన చేస్తున్న రాజకీయ నాయకులు రిపబ్లికన్లా? డెమొక్రాట్లా ? అని కాల్పులకు ముందు దుండగుడు విచారించినట్లు తెలుస్తోంది.