రిపబ్లికన్‌ నేతపై కాల్పుల కలకలం | gunman shooting on Republican lawmakers in Virginia | Sakshi
Sakshi News home page

రిపబ్లికన్‌ నేతపై కాల్పుల కలకలం

Published Thu, Jun 15 2017 7:51 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

రిపబ్లికన్‌ నేతపై కాల్పుల కలకలం

రిపబ్లికన్‌ నేతపై కాల్పుల కలకలం

అగ్రనేత స్కేలీస్‌ సహా ఐదుగురికి గాయాలు
వాషింగ్టన్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్‌ సభ్యులు బేస్‌బాల్‌ సాధన చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు ఈ ఘాతుకానికి పాల్పడటంతో కనీసం ఐదుగురికి గాయాలయ్యాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్‌బాల్‌ మైదానంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్‌ స్కేలీస్‌తో పాటు మరో ఎంపీ రోజర్‌ విలియమ్స్‌ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న ఓ సాయుధుడు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు.

అనంతరం పోలీసులు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు. ఈ సంఘటనలో తుంటికి గాయం కావడంతో జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్కేలీస్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రతినిధుల సభలో విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్కేలీస్‌ను రిపబ్లికన్ల నంబర్‌.3 నాయకుడిగా పరిగణిస్తారు. 2008లో ఆయన తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సాధన చేస్తున్న రాజకీయ నాయకులు రిపబ్లికన్లా? డెమొక్రాట్లా ? అని కాల్పులకు ముందు దుండగుడు విచారించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement