అమెరికాలో కాల్పుల మోత..! | Steve Scalise shot at baseball practice session in Virginia | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల మోత..!

Published Wed, Jun 14 2017 7:40 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

అమెరికాలో కాల్పుల మోత..!

అమెరికాలో కాల్పుల మోత..!

ప్రజాప్రతినిధులపై పేలిన తూటా

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్‌కు సమీపంలోని వర్జినీయా ప్రాంతంలో ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం బేస్‌బాల్‌ ఆట ఆడుతుండగా రైఫిల్‌ తో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రతినిధుల సభ మెజారిటీ విప్‌, రిపబ్లికన్‌ నేత స్టీవ్‌ స్కాలిస్‌ గాయపడ్డాడు. పలువురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సాయుధుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

శ్వేతజాతీయుడైన ఓ సాయుధుడు రైఫిల్‌తో ప్రజాప్రతినిధులు బేస్‌బాల్‌ ఆడుతున్న మైదానానికి వచ్చి కాల్పులకు దిగాడని, దీంతో అక్కడ ఒక్కసారిగా 50 నుంచి వందరౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షి అయిన అలబామా ప్రజాప్రతినిధి మో బ్రూక్స్‌ తెలిపారు. ఈ కాల్పులతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని చెప్పాడు. రిపబ్లికన్‌ నేత స్టీవ్‌ స్కాలిస్‌ పిరుదు భాగంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని, అదేవిధంగా ఈ కాల్పుల్లో చట్టసభ సిబ్బంది, పోలీసులు కూడా గాయపడ్డారని ఆయన సీఎన్‌ఎన్‌ చానెల్‌కు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement