Steve Scalise
-
కడుపులోకి బుల్లెట్లు.. ఎముకలు ధ్వంసం
వాషింగ్టన్: వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్ బాల్ మైదానంలో కాల్పులకు గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలనియా ట్రంప్ పరామర్శించారు. పుష్పగుచ్ఛంతో వాషింగ్టన్‌లోని ఆస్పత్రికి వచ్చిన వారు స్టీవ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్టీవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనగానే ఉందని, ఆయనకు మరిన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. ఎలాంటి విద్వేషాలు వద్దని, అందరం ఒకటేనని, కలిసి కట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని అభిలషించారు. విద్వేషపూరిత దాడులకు తాను వ్యతిరేకం అని ట్రంప్ అన్నారు. ఆస్పత్రి వైద్యులు వివరణ ఇస్తూ బుల్లెట్లు స్టీవ్ పొత్తికడుపులోకి, తుంటిలోకి దూసుకెళ్లడంతోపాటు ఎముకలను కూడా ధ్వంసం చేశాయని, ముఖ్యమైన అవయవాలు దెబ్బతిన్నాయని, రక్తస్రావం జరగుతోందని మరిన్ని ఆపరేషన్లు చేయనున్నామని చెప్పారు. రిపబ్లికన్ సభ్యులు బేస్‌బాల్ సాధన చేస్తున్న సమయంలో జేమ్స్ జే హాడ్గికిన్సన్ అనే బెల్లివిల్లేకు చెందిన సాయుధుడు కాల్పులకు పాల్పడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్‌బాల్ మైదానంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్తో పాటు మరో ఎంపీ రోజర్ విలియమ్స్ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న జేమ్స్ మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అతడికి రిపబ్లికన్లంటే ఎక్కడలేని కోపమట. -
రిపబ్లికన్ నేతపై కాల్పుల కలకలం
► అగ్రనేత స్కేలీస్ సహా ఐదుగురికి గాయాలు వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్ సభ్యులు బేస్‌బాల్ సాధన చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు ఈ ఘాతుకానికి పాల్పడటంతో కనీసం ఐదుగురికి గాయాలయ్యాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్‌బాల్ మైదానంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్తో పాటు మరో ఎంపీ రోజర్ విలియమ్స్ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న ఓ సాయుధుడు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు. ఈ సంఘటనలో తుంటికి గాయం కావడంతో జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్కేలీస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రతినిధుల సభలో విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్కేలీస్‌ను రిపబ్లికన్ల నంబర్.3 నాయకుడిగా పరిగణిస్తారు. 2008లో ఆయన తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సాధన చేస్తున్న రాజకీయ నాయకులు రిపబ్లికన్లా? డెమొక్రాట్లా ? అని కాల్పులకు ముందు దుండగుడు విచారించినట్లు తెలుస్తోంది. -
అమెరికాలో కాల్పుల మోత..!
ప్రజాప్రతినిధులపై పేలిన తూటా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. వాషింగ్టన్కు సమీపంలోని వర్జినీయా ప్రాంతంలో ప్రజాప్రతినిధులు బుధవారం ఉదయం బేస్‌బాల్ ఆట ఆడుతుండగా రైఫిల్ తో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ప్రతినిధుల సభ మెజారిటీ విప్, రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ గాయపడ్డాడు. పలువురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సాయుధుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శ్వేతజాతీయుడైన ఓ సాయుధుడు రైఫిల్‌తో ప్రజాప్రతినిధులు బేస్‌బాల్ ఆడుతున్న మైదానానికి వచ్చి కాల్పులకు దిగాడని, దీంతో అక్కడ ఒక్కసారిగా 50 నుంచి వందరౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షి అయిన అలబామా ప్రజాప్రతినిధి మో బ్రూక్స్ తెలిపారు. ఈ కాల్పులతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని చెప్పాడు. రిపబ్లికన్ నేత స్టీవ్ స్కాలిస్ పిరుదు భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అదేవిధంగా ఈ కాల్పుల్లో చట్టసభ సిబ్బంది, పోలీసులు కూడా గాయపడ్డారని ఆయన సీఎన్ఎన్ చానెల్‌కు తెలిపారు.