రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్‌లో పనిచేస్తున్న డీజే సందీప్‌ను దుండగులు పాయింట్‌బ్లాక్ రేంజ్‌లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్‌లోకి ప్రవేశించింది.
బార్‌లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్‌తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు.
గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో డీజే సందీప్‌ను తుపాకీతో ఛాతిపై కాల్చారు.
వెంటనే సందీప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్‌ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment