
చెట్టులోనే ఓ బారు..ఓ పబ్!
ఓ బీరేయాలా.. ఈ చెట్టు దగ్గరకు వెళ్లండి. మీ పనైపోతుంది. అదెలా అని అడిగితే.. ఈ చెట్టే ఓ బారు అని చెబుతాం.
ఓ బీరేయాలా.. ఈ చెట్టు దగ్గరకు వెళ్లండి. మీ పనైపోతుంది. అదెలా అని అడిగితే.. ఈ చెట్టే ఓ బారు అని చెబుతాం. నిజం.. ఈ చెట్లో ఓ పబ్ ఉంది. దక్షిణాఫ్రికాలోని లింపోపోలో ఈ పబ్ ట్రీ ఉంది. ఈ బెయోబాబ్ చెట్టు చుట్టు కొలత 150 అడుగులు. దీని లోపల భాగం కొంచెం తొలిచి.. 1933లో చిన్నపాటి బారును ఏర్పాటు చేశారు. ఓ సాధారణ బారులో ఎన్ని సదుపాయాలు ఉంటాయో ఇందులోనూ ఉంటాయి. 15-20 మంది ఆరామ్‌గా కూర్చుని మందేయొచ్చు. ఈ చెట్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వృక్షాల్లో ఒకటి. దీని వయసు 6 వేల ఏళ్లట!