బార్‌ క్యాషియర్‌ దారుణహత్య | - | Sakshi
Sakshi News home page

బార్‌ క్యాషియర్‌ దారుణహత్య

Jun 6 2023 7:04 AM | Updated on Jun 6 2023 7:11 AM

హతుడు సచిన్‌   - Sakshi

హతుడు సచిన్‌

కర్ణాటక: బార్‌లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్‌ క్యాషియర్‌ సచిన్‌ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్‌, సతీష్‌, అశోక్‌ నాయక్‌లు. నవరత్న బార్‌లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్‌ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు.

దాంతో క్యాషియర్‌ సచిన్‌ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్‌లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్‌ను బార్‌ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement