breaking news
Cashier
-
ఆన్లైన్ బెట్టింగ్‌కు అడ్డదారులు
గోదావరిఖని/చెన్నూర్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఒకసారికాదు.. అనేకసార్లు అదే ఆట ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బు సంపాదించేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసం 402 గోల్డ్‌లోన్లకు సంబంధించిన 25.17కిలోల బంగారం, రూ.1.10 కోట్ల నగదు చోరీ చేశాడు. రీజియన్ మేనేజర్ రితేశ్కుమార్గుప్తా ఆగస్టు 23న ఇచ్చిన ఫిర్యాదుతో చోరీ విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారంలో రోజుల్లోనే కేసు ఛేదించారు.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీపై పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదివారం తన కార్యాలయంలో ఆ వివరాలు వెల్లడించారు.75 శాతం బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్..బ్యాంక్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌లతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు విచారణ జరిపి ఛేదించారు. రూ.40 లక్షల నష్టాన్ని పూడ్చుకునేందుకు.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో రూ.40 లక్షలు కోల్పోయిన రవీంద ర్.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదే బెట్టింగ్‌పై దృష్టి సారించాడు. దీనికి బ్రాంచ్ మేనేజర్ మనోహర్, ఔట్సోర్సింగ్ ఉద్యో గి సందీప్‌తో కలిసి బంగారం, నగదుకు పక్కా ప్రణాళిక వేశాడు. పదినెలలుగా.. పకడ్బందీగా.. ఏడాది క్రితం చెన్నూర్ బ్రాంచ్–2 ఎస్బీఐ క్యాషియర్‌గా బదిలీపై వెళ్లిన రవీందర్.. బ్యాంక్‌లో కుదువ పెట్టిన బంగారాన్ని తీసి వేరే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందాడు. ఆ సొమ్మును బెట్టింగ్‌కు వెచ్చించాడు. గతేడాది అక్టోబర్ నుంచి గోల్డ్‌లోన్ చెస్ట్ నుంచి బంగారం తీసి తన స్నేహితులకు ఇచ్చి, ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసిన స్నేహితులకు కొంత కమీషన్ కూడా ముట్టజెప్పేవాడు. ఇలా 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలు (ఎస్ఎఫ్సీ, ఇండెల్మనీ, ముత్తూట్‌ఫైనాన్స్, గోదావరి అర్బన్, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ కార్ప్, ముత్తూట్ మినీ) 44 మంది పేర్లపై 142 గోల్డ్లోన్లు తీసుకున్నాడు.బంగారం లేకుండానే.. గోల్డ్లోన్లు.. నరిగె రవీందర్ బంగారం లేకుండానే గోల్డ్ లోన్లు తీసుకున్నాడు. తన భార్య, బావమరిది, స్నేహితుల పేర్లతో 42 గోల్డ్లోన్లు మంజూరు చేసి 4.14 కిలోల బంగారం పేరుతో రూ.1.58 కోట్లు కాజేశాడు. ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు. ఈ కేసులో 15.23 కిలోల బంగారం రికవరీ చేశారు. గోల్డ్‌లోన్ మేనేజర్ల పాత్రపై విచారణ జరుగుతోంది.15.237 కిలోల బంగారం రికవరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు రవీందర్, మేనేజర్ మనోహర్‌తోపాటు మరో 42 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 15.237 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.44 మంది నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు నరిగె రవీందర్, బ్యాంకు మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, లక్కాకుల సందీప్, ఎస్బీఎఫ్సీ సేల్స్ మేనేజర్ కొంగొంటి భీరే‹Ù, కస్టమర్ రిలేషన్ మేనేజర్ కోదాటి రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్కుమార్తోపాటు మరో 38మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు, రూరల్ సీఐ బన్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తదితరులను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. -
చెన్నూర్ ఎస్బీఐలో కుంభకోణం
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో కుంభకోణం జరిగింది. నగదుతోపాటు ఖాతా దారులు తనఖా పెట్టిన బంగారునగలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. క్యాషి యర్ పెద్దఎత్తున బంగారం, నగదు మాయం చేసిన ట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్ మనోహర్‌రెడ్డి రెండురోజుల సెలవు తర్వాత మంగళవారం విధుల్లో చేరారు. బ్యాంకులోని డబ్బు, ఖాతాదారులు తనఖా పెట్టిన నగల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలి సింది. దీంతో బ్యాంకు అధికారులు ఆడిటింగ్ నిర్వ హించారు. సుమారు 330 మంది ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు విలువైన బంగారు ఆభరణాలు, రూ.80 లక్షల నగ దు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు గుర్తించి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన క్యాషియర్ రెండ్రోజు లుగా బ్యాంకుకు రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతోపాటు బంగారం మాయంలో కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఆడిటింగ్ శుక్రవారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యాంక్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్‌హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్‌గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు. -
వ్యవసాయ కూలీలు, డ్రైవర్లకు భారీ ఉపాధి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ, నిర్మాణ కూలీలు, డ్రైవర్ల ఉద్యోగాలు (డెలివరీ రంగాల్లో) గణనీయంగా పెరగనున్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. అదే సమయంలో క్యాషియర్లు, టికెట్ క్లర్క్‌ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అంచనా వేసింది. ఈ నెల 20 నుంచి డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనుండగా, దీనికంటే ముందు ‘ఉద్యోగాల భవిష్యత్, 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని, ఇందులో 9.2 కోట్ల ఉద్యోగాలకు స్థానచలనం ఉంటుందని అంచనా వేసింది. అంటే 7.8 కోట్ల మందికి నికరంగా కొత్తగా ఉపాధి లభించనుంది. అత్యాధునిక టెక్నాలజీలు, భౌగోళిక పరమైన మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు ఈ మార్పులను నడిపిస్తాయంటూ, పరిశ్రమలు, వృత్తుల ముఖచిత్రం మారిపోనుందని అంచనా వేసింది. ఏఐ, బిగ్‌డేటాకు భారీ డిమాండ్ కృత్రిమ మేధ (ఏఐ), బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీకు వేగవంతమైన వృద్ధితోపాటు, డిమాండ్ ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అదే సమయంలో మానవ నైపుణ్యాలైన సృజనాత్మకత, చురుకుదనం, బలమైన దృక్పథం ఇక ముందూ కీలకమని పేర్కొంది. 1,000 కంపెనీలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా, వ్యాపారాల నవీకరణకు నైపుణ్యాల అంతరం పెద్ద అవరోధంగా ఉన్నట్టు గుర్తించింది. ఉద్యోగాలకు సంబంధించి 40 శాతం నైపుణ్యాలు మారిపోనున్నాయని, 63 శాతం సంస్థలు ఇప్పటికే నైపుణ్యాల అంతరాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. జెనరేటివ్ ఏఐ, వేగంగా మారిపోయే టెక్నాలజీలు పరిశ్రమలకు, ఉపాధి మార్కెట్‌కు గణనీయమైన అవకాశాలను తీసుకురావడమే కాకుండా, పెద్ద ఎత్తున రిస్క్ కూడా మోసుకొస్తాయని డబ్ల్యూఈఎఫ్ ‘ఉపాధి కల్పన’ విభాగం హెడ్ టిల్ లియోపోల్డ్ అన్నారు. సంరక్షణ ఉద్యోగాలైన నర్సులు, సెకండరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలు కూడా గణనీయంగా పెరొగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఏఐ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను గణనీయంగా మార్చివేయనుందని, దాదాపు సగం సంస్థలు ఏఐతో కొత్త అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఏఐ సాయంతో తమ సిబ్బందిని తగ్గించుకోవాలని 41 శాతం సంస్థలు భావిస్తున్నట్టు పేర్కొంది. మరో 77 శాతం సంస్థలు తమ సిబ్బందికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇప్పించే యోచనతో ఉన్నట్టు వివరించింది. -
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్‌ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్‌లో కర్టిస్.. రాజ్ పటేల్‌ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
బార్ క్యాషియర్ దారుణహత్య
కర్ణాటక: బార్లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్ క్యాషియర్ సచిన్ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్, సతీష్, అశోక్ నాయక్‌లు. నవరత్న బార్లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు. దాంతో క్యాషియర్ సచిన్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్‌లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్‌ను బార్ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
ఆమెకు వివక్షత వేధింపులే వరంగా మారాయి...ఏకంగా రూ. 72 లక్షలు గెలుపొందింది
కంపెనీల్లో కొంతమంది సహోద్యోగులతో తొందరగా కలవలేక ఇబ్బంది పడుతుంటారు. అలాగే సహోద్యోగులు కొంతమంది తమ తోటి ఉద్యోగులు అనే భావం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అందులోనూ మహిళలైతే ఇలాంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. కొంతమంది తమ కంటే బాగా పనిచేస్తుందన్న అక్కసుతో లేక తమ కంటే తక్కువ కులం అనో తమతో కలవనీకుండా దూరం పెడతూ ఆవేదనకు గురయ్యేలా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ఆమె ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. ఐతే ఆమె పోరాడి అందుకు ప్రతిగా పరిహారాన్ని కూడా అందుకుంది. వివరాల్లోకెళ్తే....లండన్‌లోని స్ట్రాట్ఫోర్డ్లో ఆస్పర్స్ క్యాసినో అనే గేమింగ్ కంపెని ఉంది. 51 ఏళ్ల రీటా లెహెర్ అనే అమె ఆ కంపెనీ క్వాషియర్గా పనిచేస్తోంది. ఐతే ఆమె ఆఫ్రికన జాతికి చెందని మహిళ. దీంతో ఆకంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆమెను దూరం పెట్టేవారు. ఆఫీసులో జరిగే ఎలాంటి ఫంక్షన్లకి, పార్టీలకి ఆమెని పిలిచేవారు కాదు. రీటాకి గేమింగ్ కంపెనీలో 22 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె ఆ కంపెనీలో హై-ఎండ్ డీలర్‌గా, షాప్ మేనేజర్‌గా కూడా విధులు నిర్వర్తించింది. కానీ ఆమెకు కంపెనీలో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి తగిన గుర్తింపు గానీ గౌరవం గానీ లేదు. అంతేకాదు ఆమె ప్రమోషన్ కోసం చేసుకున్న దరఖాస్తులను కూడా పదేపదే తిరస్కరింపబడేవి. దీంతో ఆమె చాలా ఏళ్లు విసిగిపోయి ఒక దశలో కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవాలనుకుంది కూడా. ఇక ఈ జాతి వివక్షతకు చెక్‌పెట్టాని నిర్ణయించుకుని పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కంపెనీ ప్యానెల్ ఈ విషయమై పూర్తిగా విచారణ జరిపింది. రీట్ జాతి వివక్షతకు గురిఅవ్వడమే కాకుండా సహోద్యోగులు ఆమె పట్ల నడుచుకున్న తీరు, ఆమె పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుంది. సహోద్యోగులు, అధికారులు ఒక ఉద్యోగిని వివక్షతకు గురిచేస్తే ఆ ఉద్యోగి పనిపై తీవ్రప్రభావం పడుతుందని, తన చుట్టు ఉన్న వాతావరణం బాగుంటేనే ఆ ఉద్యోగి నూతనోత్సహంతో పనిచేయగలుగుతుందని ఇది సహించలేనిదని తెలిపింది. రీటా ఎదుర్కొన్న వివక్ష వేధింపులకు పరిహారంగా ఆమెకు సుమారు రూ 72 లక్షలు అందజేయనున్నట్లు కూడా ప్రకటించింది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
క్యాష్ వ్యాన్‌పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో దొంగలు చెలరేగి పోయారు. భారీ నగదుతో వెళుతున్న క్యాష్‌వ్యాన్ పై కాల్పులు జరిపి సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు. బైక్ వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విజయ్ విహార్‌లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
చిల్లర కోసం వచ్చి..
చిట్యాల (నకిరేకల్) : రూ.20వేల చిల్లర కోసం వచ్చిన ఓ వ్యక్తి.. క్యాషియర్ పొరపాటున ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన స్థానిక కెనరా బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బ్యాంకుకు వచ్చిన శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుడు నూతనంగా విడుదలైన నోట్లు కావాలని తన వద్ద ఉన్న పది రెండు వేల రూపాయల నోట్లను క్యాషియర్‌కు ఇచ్చాడు. వాటికి చిల్లరగా క్యాషియర్ రూ.20 నోట్లనుకుని క్యాషియర్ పొరపాటును రూ.200 బెండల్ను సదరు యువకుడికి ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రూ.20వేలుపోను.. రూ.లక్షా 80 వేల తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం బ్యాంకు లావాదేవీల జమ, ఖర్చుల్లో భారీ తేడాలు రావడంతో.. బ్యాంకు అధికారులు సీసీ పుటేజీలను పరిశీలించారు. పసువు రంగు చొక్కా వేసుకుని, మెడలో నల్లటి బ్యాగుతో వచ్చిన గడ్డంతో ఉన్న యువకుడు క్యాషియర్ కిష్టయ్య పొరపాటున ఇచ్చిన నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మొత్తం క్యాష్ పోవటంతో బ్యాంకు సిబ్బంది తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. -
గుండెపోటుతో ఎస్బీఐ క్యాషియర్ కన్నుమూత
నాగ్ పూర్: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభం బ్యాంకు ఉద్యోగుల ప్రాణాల మీదకు తెస్తోంది.ప్రజలకు నగదును అందుబాటులోకి తెచ్చే క్రమంలో బ్యాంకు సిబ్బంది అసువులు బాస్తున్నారు. బుధవారం బ్యాంక్ మేనేజర్ ఆకస్మిక మృతిని మర్చిపోకముందే మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఎస్బీఐ అంబాజరి బ్రాంచ్ కార్యాలయంలో క్యాషియర్ గా పనిచేస్తున్న ఆర్వీ రాజేష్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. దీనికి పని ఒత్తిడే ప్రధానకారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా రోహ్తక్ సహకార బ్యాంకు మేనేజర్ రాజేష్ కుమార్ బుధవారం ఉదయం చాంబర్లోనే మరణించారు. అంతకుము మూడు రోజుల నుంచి ఆయన బ్యాంకు బయట కాలు పెట్టలేదని, విపరీతమైన పని ఒత్తిడి వల్లే గుండెపోటు వచ్చిందని సహోద్యోగులు చెప్పిన సంగతి తెలిసిందే. -
క్యాషియర్ హత్య కేసులో నలుగురు అరెస్ట్
కూకట్పల్లి సుమిత్రానగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో సిబ్బందిపై దాడి చేసి క్యాషియర్ సంఘమేశ్వర్ ప్రాణాలు పోవడానికి కారణమైన కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివ, బలరామ్, అనీష్, నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురూ మూసి ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ పోయాలంటూ అక్కడే ఉన్న సిబ్బందితో వాగ్వివాదానికి దిగడం... అనంతరం కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో క్యాషియర్ సంఘమేశ్వర్ ప్రాణాలు కోల్పోగా, మేనేజర్ రాజుకు గాయాలు అయ్యాయి. పట్టుబడిన నలుగురు నిందితుల్లో అనీష్ టీడీపీ మాజీ కార్పొరేటర్ బాబురావు కుమారుడు కావడం గమనార్హం. -
ఎస్బీఐలో క్యాషియర్ చేతివాటం
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు అర్బన్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటప్ప తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు సమీపంలోని దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన ఎ. నాగశేఖర్‌రెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఎస్బిఐ బద్వేలు బ్రాంచ్‌లో కస్టమర్ అసిస్టెంటుగా విధులలో చేరారు. అయితే ఈ ఏడాది మే,జూన్ నెలలో కోనేరు లక్ష్మిదేవి ఖాతా నుంచి రూ.5.88లక్షలు, జాండ్లవరం వెంకటసుబ్బయ్య ఖాతా నుంచి రూ.7.20లక్షలు, కోనేటి గుర్రమ్మ ఖాతా నుంచి రూ.2.02లక్షలు మొత్తం రూ.14.74 లక్షలు డ్రా చేసుకున్నారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపేరుతో పడిగపాటి కళ్యాణ్ నుంచి లక్ష, పి. రామక్రిష్ణారెడ్డి నుంచి లక్ష, పి.వెంకటసుబ్బారెడ్డి నుంచి లక్ష, కళ్యాణి నుంచి రూ.50వేలు, వెంకటల క్షుమ్మ నుంచి రూ.50వేలు చొప్పున రూ.4లక్షల మేర నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి మోసగించారు. ఈ విషయం తెలియడంతో ఎస్బిఐ రీజినల్ మేనేజర్ జె.ఎస్.ఆర్. ప్రసాద్ ఆదేశాల మేరకు బద్వేలు బ్రాంచ్ మేనేజర్ ఎం.సామ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశేఖర్‌రెడ్డి జూలై నెల 17వ తేదీ నుంచి విధులకు కూడా హాజరు కానట్లు తెలిసింది. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్ఐ నాగమురళి తెలిపారు. -
పెట్రోల్‌బంక్‌కు కస్టమర్లా వచ్చి దొంగతనం