గుండెపోటుతో ఎస్బీఐ క్యాషియర్ కన్నుమూత | Nagpur: RV Rajesh, Cashier at SBI's Ambhajari branch passes away at work after a heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఎస్బీఐ క్యాషియర్ కన్నుమూత

Published Fri, Nov 18 2016 3:20 PM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM

గుండెపోటుతో ఎస్బీఐ క్యాషియర్  కన్నుమూత - Sakshi

గుండెపోటుతో ఎస్బీఐ క్యాషియర్ కన్నుమూత

నాగ్ పూర్: పెద్ద నోట్ల రద్దుతో  ఏర్పడిన సంక్షోభం బ్యాంకు ఉద్యోగుల ప్రాణాల మీదకు తెస్తోంది.ప్రజలకు నగదును అందుబాటులోకి  తెచ్చే క్రమంలో  బ్యాంకు సిబ్బంది అసువులు  బాస్తున్నారు.  బుధవారం  బ్యాంక్ మేనేజర్ ఆకస్మిక మృతిని మర్చిపోకముందే మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో  మరో విషాదం చోటుచేసుకుంది.  ఎస్బీఐ అంబాజరి బ్రాంచ్ కార్యాలయంలో క్యాషియర్ గా పనిచేస్తున్న ఆర్వీ రాజేష్  విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు.  దీనికి  పని ఒత్తిడే ప్రధానకారణమని  ప్రాథమికంగా అంచనా వేశారు.

కాగా రోహ్‌తక్ సహకార బ్యాంకు మేనేజర్ రాజేష్ కుమార్ బుధవారం ఉదయం చాంబర్‌లోనే  మరణించారు. అంతకుము మూడు రోజుల నుంచి ఆయన బ్యాంకు బయట కాలు పెట్టలేదని, విపరీతమైన పని ఒత్తిడి వల్లే గుండెపోటు వచ్చిందని సహోద్యోగులు  చెప్పిన సంగతి తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement