కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో సిబ్బందిపై దాడి చేసి క్యాషియర్ సంఘమేశ్వర్ ప్రాణాలు పోవడానికి కారణమైన కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివ, బలరామ్, అనీష్, నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురూ మూసి ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ పోయాలంటూ అక్కడే ఉన్న సిబ్బందితో వాగ్వివాదానికి దిగడం... అనంతరం కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో క్యాషియర్ సంఘమేశ్వర్ ప్రాణాలు కోల్పోగా, మేనేజర్ రాజుకు గాయాలు అయ్యాయి. పట్టుబడిన నలుగురు నిందితుల్లో అనీష్ టీడీపీ మాజీ కార్పొరేటర్ బాబురావు కుమారుడు కావడం గమనార్హం.