రెండు గ్రూపుల మధ్య గొడవ
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వారాసిగూడ చౌరస్తాలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాల ప్రకారం.. వారాసిగూడ చౌరస్తాలోని ఓ మద్యం షాపులో నిబంధనలకు వ్యతిరేకంగా విశాలమైన సిట్టింగ్‌రూంను ఏర్పాటు చేసి మినీబార్‌ను నిర్వహిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం రెండు గ్రూపులు తమ స్నేహితులతో కలిసి మినీబార్‌లో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. చౌరస్తా నుంచి నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఫజల్, శివకుమార్‌లతోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మినీబార్లు ఏర్పాటు చేయడంతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయని, వారాసిగూడ చౌరస్తాలో మద్యం షాపులను అనుమతి ఇవ్వొద్దని ఆందోళనలు చేసిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment