చంపుతానంటూ పోలీసుల ఎదుటే వార్నింగ్‌ | Midnight Gang War In Rahmath Nagar Hyderabad | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి గ్యాంగ్‌వార్‌ కలకలం

Published Sat, May 4 2019 10:25 AM | Last Updated on Sat, May 4 2019 12:11 PM

Midnight Gang War In Rahmath Nagar Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరంలో అర్థరాత్రి గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. కాలాపత్తర్‌ ఘటన మరిచిపోకముందే రహమ్మత్‌ నగర్‌లో మరో ఘటన వెలుగుచూసింది. శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో రెండు గ్రూపులుగా విడిపోయిన యువకులు రెచ్చిపోయారు. ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. ఓ యువకుడి బైక్‌ను సైతం తగులబెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రహమ్మత్‌ నగర్‌ వాసులైన అరుణ్‌, ఉమాకాంత్‌ గ్యాంగ్‌ల మధ్య నిన్న అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఉమాకాంత్‌ అనే యువకుడు నమస్తే పెట్టకపోవటంతో అరుణ్‌ అనే యువకుడు అతడిపై ఆగ్రహించాడు.

ఉమాకాంత్‌ అండ్‌ గ్యాంగ్‌ను తీవ్రంగా మందిలించాడు. దీంతో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమాకాంత్‌కు చెందిన బైక్‌ను అరుణ్‌ సహచరులు తగులబెట్టారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి ఉమాకాంత్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడికి కూడా వచ్చిన అరుణ్‌! ఉమాకాంత్‌ను చంపుతానంటూ పోలీసుల ఎదుటే బెదిరించాడు. దీంతో జూబ్లిహిల్స్‌ పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేశారు.

నాపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాలని చూశాడు : బాధితుడు
అరుణ్‌కు నమస్తే పెట్టలేదనే కోపంతోనే తనపై క్షక్ష్య కట్టారని బాధితుడు ఉమాకాంత్‌ తెలిపాడు. అందులో భాగంగానే రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో తనను చంపేందుకు అరుణ్ అతని అనుచరులు యత్నించారని చెప్పాడు. తనపై పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూశారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకొని, బైక్ వదలి పారిపోయినట్లు వెల్లడించాడు. దీంతో తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. నాకు ప్రాణహాణి ఉంది, పేద కుటుంబం.. నాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను సేవ్ చేయడానికి వచ్చిన పవన్ అనే వ్యక్తిపై రౌడి షీట్‌ బుక్ చేస్తున్నారని తెలిపాడు.

హంగామా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
అర్థరాత్రులు ఎవరైనా హంగామా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకంటామని ఏసీపీ ఏఎస్‌ రావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరుణ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది రెండు గ్రూపుల మధ్య గొడవ కాదని, ఇద్దరు వ్యక్తుల గొడవని చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement