liquor drinking
-
వైరల్ వీడియో: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
-
Viral Video: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
లక్నో: ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతి లెక్క చేస్తున్నవ్’ అంటారు. కానీ, నిజానికి కోతి కల్లు తాగటం చూసినవారు చాలా తక్కువ. అలాంటిది లిక్కర్‌కు బానిసైన వానరాలూ ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, ఓ కోతి ఏకంగా వైన్స్ షాప్‌లోకి దూరి చోరీ చేస్తోంది. మద్యం మత్తులో తూలుతూ జల్సా చేస్తోంది. బీరు బాటిల్ ఎత్తి తాగుతున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో లిక్కర్‌కు అలవాటు పడిన ఓ కోతి షాపుల్లో దూరి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక వైన్స్ షాపుల విక్రయదారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ కోతి మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి బాటిళ్లు లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే మీద పడి కరిచేందుకు సైతం ఎనకాడటం లేదటా. దీంతో వైన్స్ షాపులకు వచ్చి మందు కొనాలంటేనే భయపడుతున్నారటా మద్యం ప్రియులు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. రాయ్‌బరేలీ జిల్లాలోని గడాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్‌గంజ్ ప్రాంతంలో ఓ కోతి బీరు తాగుతున్న వీడియో తెగ వైరల్‌గా మారింది. ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
మద్యం సేవించాలని మంత్రి ఉచిత సలహా.. వీడియో వైరల్
రాయ్‌పుర్: మద్యం సేవించటం ద్వారా కుటుంబాలు రోడ్డు పాలవుతాయని పెద్దలు చెబుతుంటారు. లిక్కర్‌కు దూరంగా ఉండాలని కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు. మద్యం హానికరం అని లిక్కర్ సీసాలపై పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. కానీ, డి-అడిక్షన్ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లిక్కర్ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ‘నశా ముక్త్ అభియాన్’లో భాగంగా వద్రాఫ్నగర్లో డి-అడిక్షన్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. పలు పాఠశాలలకు చెందిన పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా లిక్కర్ ప్రజలను ఏకం చేస్తుందటూ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ నేను ఓ మీటింగ్‌కు హాజరయ్యాను. అక్కడ ఓ వర్గం లిక్కర్ అనారోగ్యానికి గురిచేస్తుందని, దానిని తాగటం మంచిది కాదని వాదించింది. మరోవర్గం.. లిక్కర్ వల్ల లాభాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, లిక్కర్ ప్రతిఒక్కరిని కలుపుతుంది. కానీ, నియంత్రణ ఉండాలి. మనం సైతం ఉత్సవాలు, ఎన్నికల సమయంలో దానిని ఉపయోగిస్తాం. ’ అని పేర్కొన్నారు టెకమ్. బీజేపీ విమర్శలు.. లిక్కర్‌పై రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుట్టారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రాకర్. ‘భూపేశ్ బఘేల్ జీ ప్రభుత్వం, పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఏఒక్కరికి విషయం అర్థంకాదు. ఇది పని చేసే ప్రభుత్వం కాదు. ఢిల్లీ(కాంగ్రెస్ అధిష్ఠానం) చేతిలో కీలుబొమ్మ. ’ అని ఆరోపించారు. మరోవైపు.. కొద్ది రోజుల క్రితం భంగ్, గంజాయీని లిక్కర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. #WATCH | At a de-addiction drive, Chhattisgarh Min Premsai Singh Tekam says, "There should be self-control. I once went to a meeting where they spoke for & against liquor. One side spoke of its benefits. Liquor should be diluted, there should be a duration (to consume it)"(31.8) pic.twitter.com/FE8HJd3ktD — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 1, 2022 ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్‌ను కలవనున్న అధికార కూటమి నేతలు -
Hyderabad: మద్యం మత్తులో గ్యాంగ్‌వార్
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వారాసిగూడ చౌరస్తాలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాల ప్రకారం.. వారాసిగూడ చౌరస్తాలోని ఓ మద్యం షాపులో నిబంధనలకు వ్యతిరేకంగా విశాలమైన సిట్టింగ్రూంను ఏర్పాటు చేసి మినీబార్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు గ్రూపులు తమ స్నేహితులతో కలిసి మినీబార్లో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. చౌరస్తా నుంచి నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఫజల్, శివకుమార్‌లతోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మినీబార్లు ఏర్పాటు చేయడంతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయని, వారాసిగూడ చౌరస్తాలో మద్యం షాపులను అనుమతి ఇవ్వొద్దని ఆందోళనలు చేసిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తగ్గిన మద్యం వినియోగం
కావలి: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 27 నెలలుగా అమలు చేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ కారణంగా మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని సెబ్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా, ప్రభుత్వం 33 శాతం మేర దుకాణాల సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతం 2,975 దుకాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు లాభాపేక్షతో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మద్యం దుకాణాలు నిర్వహించగా.. ప్రస్తుత ప్రభుత్వం దశల వారీ నియంత్రణకు దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్‌రెడ్డి, సెబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. -
ఆరుబయట తాగితే అంతే
విజయనగరం: మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బహిరంగ మద్యపానం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా పటిష్టం చేసింది. ఓ పక్క కోవిడ్ థర్డ్ వేవ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరో పక్క ఎస్పీ దీపికా ఎం.పాటిల్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని కేసులు నమోదుచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 122 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేసింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై కొరడా ఝుళిపించి 1,894 కేసులు నమోదుచేసింది. 185 మందిపైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. స్నిపర్, షాడోటీంమ్‌లతో పాటు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటుచేసి కోడిపందాలు, పేకాట, మద్యం తాగి బైక్‌లు నడపడం, శివారు ప్రాంతాల్లో తగాదాలు, గ్రామాల్లో కొట్లాటలు వంటివి లేకుండా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నాటుసారా, గంజాయి, నల్లబెల్లం ఊటలు, ఇసుకఅక్రమ తవ్వకాలపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అలాగే జిల్లా పోలీసుల సాయంతో ఆయా స్టేషన్ల పరిధిలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై అప్రమత్తత అంశాలను, మరో పక్క దిశా యాప్‌పై విస్త్రత అవగాహన చేపడుతున్నారు. మహిళా సంరక్షణ పోలీసుల సాయంతో గ్రామాల్లోని వార్డుల్లో విస్త్రతంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కలి్పంచే దిశగా జిల్లా పోలీస్ శాఖ కృషిచేస్తోంది. కఠిన చర్యలు చేపడతాం రోడ్డుప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నాం. చిన్న చిన్న తగాదాలు ఎక్కువగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. బమిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కోవిడ్ థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలకారు. -దీపికా ఎం.పాటిల్, ఎస్పీ, విజయనగరం -
AP: రాష్ట్రంలో మద్యం వినియోగం భారీగా తగ్గింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అక్రమ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. 2019లో 4,500 ఉన్న మద్యం దుకాణాలను 2,934కు తగ్గించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర నియంత్రణ చర్యలతో రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని రజత్ భార్గవ చెప్పారు. బీరు అమ్మకాలు 70 శాతం, మద్యం అమ్మకాలు 40 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్రమ మద్యం వినియోగం పెరగకుండా చూసేందుకు ఎస్ఈబీ, విజిలెన్స్ విభాగాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను తనిఖీలు చేస్తూ వాటి పనితీరును సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ విధానాలతో సానుకూల ఫలితాలను సాధించేలా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కేఎల్ భాస్కర్లతోపాటు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు. -
అనంతలో కుటుంబకలహాలతో విషాదం..
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త మద్యం మానడం లేదని భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో..మనస్తాపం చెందిన భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రొద్దం మండలం దొడగట్ట గ్రామంలో జరిగింది. భర్త రంగనాథ్ మద్యం మానడం లేదని భార్య నాగలక్ష్మి(40) అనే గృహిణి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నాం మృతిచెందింది. దీంతో మనస్తాపం చెందిన భర్త రంగనాథ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగనాథ్ ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో వీరి పిల్లలిద్దరూ నిస్సాహాయక స్థితిలో ఉండిపోయారు. -
మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
మెదక్(పటాన్చెరు): మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్చెరులో ఆదివారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ధాండూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆదివారం పటాన్‌చెరుకు వచ్చాడు. అయితే తన భార్య కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసేందుకు పటాన్చెరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదును కుంటుంబ సభ్యులు ఉన్న ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయాలని తెలిపారు. దీంతో కొత్తగా నిర్మిస్తున్న 11కెవీ టవర్ ఎక్కి బలవన్మరణానికి యత్నించాడు. అయితే పోలీసులు సదరు వ్యక్తితో మాట్లాడి కిందకి దించారు.