అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త మద్యం మానడం లేదని భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో..మనస్తాపం చెందిన భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రొద్దం మండలం దొడగట్ట గ్రామంలో జరిగింది.
భర్త రంగనాథ్ మద్యం మానడం లేదని భార్య నాగలక్ష్మి(40) అనే గృహిణి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నాం మృతిచెందింది. దీంతో మనస్తాపం చెందిన భర్త రంగనాథ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగనాథ్ ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో వీరి పిల్లలిద్దరూ నిస్సాహాయక స్థితిలో ఉండిపోయారు.