wife death
-
మరో యువతితో భర్త చనువు.. పెళ్లైన 6 నెలలకే గర్భిణి ఆత్మహత్య
వరంగల్: వారికి పెళ్లయి ఆరు నెలలైంది. ఆమె రెండు నెలల గర్భిణి. కానీ భర్త.. మరో అమ్మాయితో చనువుగా ఉన్న ఫొటోలను చూసి ఇదేమిటని అడిగితే ‘నీవు చస్తే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఉరి వేసుకొని చావు’ ..అంటూ ఈసడించుకోవడంతో మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరి కృష్ణ–రేణ దంపతుల కుమార్తె అర్బన అలియాస్ హర్షిణి (20)ని పాలకుర్తి మండలం లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన మల్యాల అంజనేయులు కుమారుడు వినేష్‌కు ఈ ఏడాది మార్చి 10న ఇచ్చి వివాహం జరిపారు. 20 రోజుల క్రితం అర్చనను భర్త, తల్లి కలిసి జనగామలోని ఓ అస్పత్రికి తీసుకెల్లి చూపించగా రెండు నెలల గర్బిణిగా వైద్యులు నిర్దారించారు. అక్కడి నుంచి అర్చనను భర్త వినేష్ తన ద్విచక్రవాహనంపై పుట్టింటికి తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. గత నెల 31న వినేష్ భార్య వద్దకు చేరుకున్నాడు. భర్త సెల్‌ఫోన్‌ను అర్చన పరిశీలిస్తుండగా వినేష్ మరో యువతితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను గుర్తించింది. ఆ అమ్మాయి ఎవరు అని నిలదీయగా ‘నీవు చస్తే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఉరి వేసుకొని చావు’ ..అంటూ కోపంతో భర్త వెళ్లిపోయాడు. దీంతో అర్చన తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఉదయం భర్త వినేష్,.. అర్చనకు ఫోన్ చేసి గొడవపడ్డాడు. ఈ విషయం అర్చన తల్లిదండ్రులకు చెప్పి ఏడ్చింది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లాక తీవ్ర మనోవేదనతో ఉన్న అర్చన బాత్రూంలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుంది. పక్కింటి వారు గుర్తించి ఉరి నుంచి అర్చనను విడదీయగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్న కొద్ది సేపటికే మరణించింది. అల్లుడు వినేష్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వినేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చాగర్ల రఘుపతి తెలిపారు. ఏడాది క్రితం కొడుకును కోల్పోయి.. కృష్ణ–రేణ దంపతులకు కుమారుడు మహేష్, కూతురు అర్చన ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం కుమారుడు మహేష్ భువనగిరి జిల్లాలో అనుమానాస్పదంగా మరణించాడు. అప్పటికే కూతురు అర్చనకు పెళ్లి ఖాయం కావడంతో వివాహం జరిపించారు. పెళ్లి అయిన ఆరు నెలలకే కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. -
దెయ్యం పట్టుకుందని భార్యను చితకబాదిన భర్త
కాకినాడ: పట్టుకున్న దెయ్యాన్ని వదిలిస్తానంటూ భార్యను చెప్పుతో విచక్షణారహితంగా చితకబాదడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై బుధవారం రాజోలు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాజోలు ఎస్సై ఫృధ్వీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలు మండలం శివకోడు కందికట్టు వారి గ్రూపునకు చెందిన బళ్ల విజయ్‌కుమార్‌కు 2015లో అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన మనీషాతో వివాహమైంది. వారికి మూడేళ్ల కిరిటీ సాయివర్థన్, ఏడాదిన్నర హర్ష ఉన్నారు. కొంత కాలంగా భార్యపై అనుమానంతో భర్త విజయ్‌కుమార్ చీటికిమాటికీ గొడవ పడుతున్నాడు. మనీషా తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లడంతో తరచూ డబ్బులు పంపించాలని వేధించేవాడు. ఈ పరిస్థితుల్లో గత నెల 28వ తేదీన మనీషాకు దెయ్యం పట్టుకుందని చెప్పుతో చితకబాది, మెడను తిప్పడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ స్థితిలో ఉన్న ఫొటోలను విజయ్‌కుమార్ మనీషా తండ్రి శ్రీనివాసరావుకు పంపించాడు. వెంటనే ఆయన తన కుమారుడు కార్తీక్‌తో శివకోడు వచ్చి మనీషాను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం గత నెల 31వ తేదీన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే దెయ్యం పట్టుకోవడంతో అనారోగ్యానికి గురై, తన భార్య చనిపోయిందని నమ్మించి మృతదేహాన్ని తన ఇంటికి భర్త విజయ్‌కుమార్ తీసుకుని వచ్చాడు. కువైట్‌లో ఉన్న మనీషా తల్లి వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేయాలని మనీషా తండ్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. కుమార్తె మృతి చెందిందన్న విషయం తెలియగానే తల్లి కువైట్ నుంచి బుధవారం శివకోడు వచ్చి తన కుమార్తె అనారోగ్యంతో చనిపోలేదని, దెయ్యం పట్టుకుందని అబద్ధాలతో తన అల్లుడే చంపేశాడని భోరున విలపించింది. తన కుమార్తె మృతిపై విచారణ చేయాలని తండ్రి శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై ఫృధ్వీ కేసు నమోదు చేశారు. పి.గన్నవరం సీఐ రజనీకుమార్ దర్యాప్తు చేపట్టారు. తహసీల్దారు బి.ఎం.ముక్తేశ్వరరావు ఘటనా స్థలంలో విచారణ నిర్వహించారు. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టమ్‌కు తరలించామని, భర్త విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై ఫృధ్వీ తెలిపారు. -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను..
అమలాపురం టౌన్: భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్చార్జి సీఐ వీరబాబు, స్థానికుల కథనం ప్రకారం.. కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయకుమార్(47) ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాలో మృతి చెందారు. ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న విజయకుమార్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసీలక్ష్మికి మూడు నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి, అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసీలక్ష్మి బెడ్ రూమ్‌లో మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయకుమార్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణవార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి.. అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడ్వడం అందరినీ కలచివేసింది. తులసీలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు. -
ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. అయితే ఆమె మృతికి గల కారణాన్ని మాత్రం ట్రంప్ చెప్పలేదు. 'న్యూయార్క్ సిటీలోని తన నివాసంలో ఇవానా మరణించింది. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: నిరసనల్లో వేల మంది.. పట్టించుకోని జంట.. ఫోటో వైరల్ -
భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
ముంబై: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య మృతికి అతడే కారణమని ఆరోపణలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని బందూప్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ అమ్మాయిది ఆత్మహత్య కాదు.. హత్యేనని బాధితురాలి తల్లి, సోదరి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జితేంద్ర, కోమల్ అగర్వాల్ భార్యాభర్తలు. వీరు ముంబైలో నివసిస్తున్నారు. భర్త జితేంద్ర ప్రముఖ యూట్యూబర్. అతడి ఛానల్ పేరు ‘జిత్ జాన్ (Jeetu Jaan)’. అయితే ఇటీవల భార్య కోమల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమల్‌ది ఆత్మహత్య కాదు హత్యేనని ఫిర్యాదు చేయడంతో జితేంంద్రను అరెస్ట్ చేశారు. ‘అక్కను మానసికంగా శారీరకంగా జితేంద్ర వేధింపులకు గురి చేసేవాడు. రెండు మూడుసార్లు నన్ను కూడా వేధించాడు. కొంతమంది స్నేహితురాళ్లను కూడా వేధించాడు. వేధింపులు తట్టుకోలేక ఒకసారి ఒక్క ఇంట్లోంచి బయటకు వచ్చేసింది కూడా. అతడి వేధింపులతోనే అక మరణించింది. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కోమల్ సోదరి ప్రియ తెలిపింది. కేసు దర్యాప్తులతో ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..! ’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన -
నువ్వులేని జీవితం నాకెందుకని..
నాలుగు నెలల క్రితమే వివాహమైన ఆ దంపతులకు ఒకరంటే మరొకరికి ప్రాణం. మమతానురాగాలే తెరచాపగా..ఆప్యాయతే ఆలంబనగా.. సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మానాన్నలం కాబోతున్నామన్న శుభవార్త వారిలో అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. అయితే విధికి కన్నుకుట్టింది. కడుపునొప్పి రూపంలో భార్యను మృత్యువు కాటేసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన భర్త కూడా నీవులేని జీవితం నాకెందుకంటూ ప్రాణం తీసుకున్నాడు. గుర్తు తెలియని వాహనం కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఇచ్ఛాపురం మండలంలోని కొఠారీ గ్రామంలో చోటుచేసుకుంది. సాక్షి, ఇచ్ఛాపురం: కొఠారీ గ్రామానికి చెందిన బుడ్డేపు రామారావు, పార్వతిల ఒక్కగానొక్క కొడుకు రాజేష్ (చూడామణి) (28). ఈయన విదేశాల్లో కూలీగా పని చేస్తుండేవాడు. కోవిడ్ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చేశాడు. ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడకు చెందిన జయ(26)తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ప్రస్తుతం జయ గర్భిణి. అయితే ఆమెకు ఆదివారం సాయంత్రం కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కడుపు నొప్పి తీవ్రం కావడంతో వైద్యుల సూచనల మేరకు హుటాహుటీన బరంపురం పెద్దాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో జయ కన్నుమూసింది. మృతదేహాన్ని కొఠారీ గ్రామానికి సోమవారం తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త రాజేష్ జీర్ణించుకోలేకపోయాడు. మంగళవారం ఉదయం ఈదుపురంలో టిఫిన్ చేస్తానంటూ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఇచ్ఛాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు, ఇచ్ఛాపురం–ఈదుపురం క్రాస్ రోడ్డు పక్కనే తన వాహనాన్ని ఉంచి డివైడర్‌పై కూర్చొని వేదనకు గురయ్యాడు. బరంపురం నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. -
చంపేసి..ఆపై కనిపించడం లేదంటూ!
సాక్షి, గన్నవరం: అనుమానంతో కట్టుకున్న భార్యనే హతమార్చాడు.. ఎవ్వరికీ కనపడకుండా ముళ్లకంచెల్లో పడేసి ఏమీ తెలియనట్లుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కళ్లు గప్పేందుకు రోజు స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆచూకీ గురించి వాకబు చేస్తూ కపట ప్రేమను కనబరిచాడు. చివరికి ఆ భర్తపైనే అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. వివరాలు.. కంకిపాడుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానుమోలు శివనాగరాజకు పదేళ్ల కిందట శిరీష(31)తో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు ఉన్నారు. కొంత కాలం నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న శివనాగరాజు తరచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. గత నెల 25న శివనాగరాజు తల్లి ధనలక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని ఆస్పత్రిలో చేర్చాడు. దీంతో అత్తకు సపర్యలు చేసేందుకు శిరీష కూడా ఆస్పత్రిలోనే వద్ద ఉంది. గత నెల 26వ తేదీ రాత్రి ఆస్పత్రికి వచ్చిన శివనాగరాజు ఇంటికి కారులో తీసుకెళ్లాడు. కేసరపల్లి ఏలూరు కాలువ పక్కన నిర్మానుషంగా ఉండే రోడ్డులో కారు ఆపి ఆమె తలపై రాడ్‌తో కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న ముళ్లకంచెల్లో పడేసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. కనిపించడం లేదంటూ.. రెండు రోజుల అనంతరం ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన శివనాగరాజు పిన్నమనేని ఆస్పత్రికి వచ్చిన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీనితో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తూ ఆచూకీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నాడు. అయితే అతను తడబాటుకు గురవుతుండడం గ్రహించిన పోలీసులు గతంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో భార్యను హత్యచేసినట్లు నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఏలూరు కాలువ పక్కనే ఉన్న రోడ్డులో ముళ్లకంచెల్లో పడివున్న పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సతీ వియోగం భరించలేక..
వారికి పెళ్లయి దశాబ్దంన్నర అయ్యింది. ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. సంతానం లేకపోయినా అన్యోన్యంగా ఉంటూ పలువురి మన్ననలు చూరగొన్నారు. ఆమె తనకన్నా వయస్సులో ఐదేళ్లు పెద్దదైనా కళ్లల్లో పెట్టుకుని చూసుకునేవాడు. జీవితం సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో విధి వక్రించింది. భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు అన్నీ తానై సేవలందించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్ర అనారోగ్యానికి గురై భార్య కన్నుమూసింది. ఆమె లేని ఈ లోకంలో తాను మాత్రం ఎందుకంటూ తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో చోటు చేసుకుంది. అమరావతి, రామవరప్పాడు (గన్నవరం): రామవరప్పాడు గోళికృష్ణయ్య వీధిలో గొట్టిపాటి నాగమురళీకృష్ణ (45) ప్రశాంతి (50) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రశాంతి తల్లితండ్రులు కృష్ణలంకలో ఉంటారు. మురళీకృష్ణ తల్లిదండ్రులు మచిలీపట్నంలో ఉంటున్నారు. వీరికి వివాహం అయిన తర్వాత గ్రామంలోనే ఉంటున్న ప్రశాంతి అక్కకు చెందిన భవనంలోని ఓ పోర్షన్లో కాపురం పెట్టారు. మురళీకృష్ణ మహానాడు రోడ్డులోని ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంతి కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైంది. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో అప్పటి నుంచి భార్యను కంటికిరెప్పలా చూసుకుంటూ సేవలందించాడు. ఉద్యోగానికి వెళ్తూనే భార్యకు అన్ని సమకూర్చేవాడు. కాలక్రమేణా వ్యాధి ముదిరి లివర్‌కు సోకింది. దీంతో నిత్యం ఏసీ గదిలోనే భార్యను ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్రూమ్కు వెళ్లి ప్రశాంతి అనుకోకుండా మూడుసార్లు కింద పడిపోయింది. దీంతో ఆమెను తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రశాంతి మంచంపైనే తుది శ్వాస విడిచింది. ఇది గమనించిన భర్త తీవ్ర మనోవేధనకు గురై హాల్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 11 గంటలు దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్క పోర్షన్ నివాసితులు తలుపులు బద్దలు కొట్టి చూడగా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ అంకినేని ప్రసాద్, పటమట ఎస్ఐ సత్యసుధాకర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మురళీకృష్ణ మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనపరుకున్నారు. బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్యోన్యతకు మారుపేరుగా... మురళీకృష్ణ, ప్రశాంతి ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఒక్క చిన్న గొడవ కూడా జరిగిన దాఖలాలు లేవని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మురళీకృష్ణ చలాకీగా అందరిని నవ్విస్తూ ఉండేవాడని సన్నిహితులు, తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతరమయ్యారు. ఇంట్లో భార్య ఒంరిగా ఉంటుందని, సమయానికి ఇంటికి వచ్చేసి ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడని చెబుతున్నారు. భార్య అనారోగ్యానికి గురైన నాటి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, సమయానికి మందులు ఇవ్వడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటివి చేసేవాడని పక్క నివాసితులు తెలిపారు. వీరి మృతదేహాలను చూసిన చుట్టుపక్కల వాళ్లు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకే... భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకే తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు మురళీకృష్ణ సూసైడ్ నోట్లో వివరించాడు. కొన్ని మాసాలుగా ప్రశాంతికి ఆరోగ్యం బాగోవడం లేదని, ఆమెను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమపడ్డానని రాశాడు. బ్యాంక్‌లో కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సూసైడ్ నోట్లో వివరంగా రాశాడు. -
అనుక్షణం ఆమె గురించే ఆలోచిస్తూ..
మంగళగిరూరల్: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య నెల రోజులక్రితం కన్నుమూసింది. భార్యావియోగం భరించలేక అనుక్షణం ఆమె గురించే ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపంతో తన ఇద్దరు కొడుకులకు విషం ఇచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఈ హృదయవిదారక సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కొప్పురావు కాలనీకి చెందిన తిరువీధుల లక్ష్మీనారాయణ బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మీనారాయణకు 13 సంవత్సరాల క్రితం శిరీషతో వివాహం జరిగింది. వీరికి కుమారులు తేజశ్వర్(11), అమరేశ్వర్(9) ఉన్నారు. గత నెల 12వ తేదీన శిరీష అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. అర్ధాంగి మరణాన్ని జీర్ణించుకోలేక తాను కూడా తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తన స్నేహితులకు, బంధువులకు వాట్సప్ ద్వారా ‘ఇక సెలవు.. మీ అండ్ మై సన్స్ లాంగ్ స్లీప్’ అంటూ సందేశం పంపాడు. తదనంతరం తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తీసుకున్నాడు. లక్ష్మీనారాయణ తండ్రి సాంబశివరావుకు స్నేహితులు ఫోన్ చేసి విషయం తెలిపారు. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ముగ్గురూ మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి ముగ్గురూ మరణించినట్టుగా నిర్ధారించారు. మంచంపై లభించిన స్యూసైడ్ నోట్లో లక్ష్మీనారాయణ మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ‘‘శిరీష మరణంతోనే నేను మానసికంగా మృతిచెందాను. శిరీష అస్తికలను దాచివుంచాను. మాతోపాటే తన అస్తికలను కలిపి పూడ్చండి. మేము నలుగురం ఒకే చోట ఉండాలి. నా చివరి కోర్కెను తీర్చండి’’ అంటూ అందులో పేర్కొన్నాడు. కోడలు మరణించిన నెలకే కొడుకు మనవళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో లక్ష్మీనారాయణ తండ్రి సాంబశివరావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తేజశ్వర్, అమరేశ్వర్ (ఫైల్) -
నీవు లేక నేను లేను..
♦ భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య ♦ అనాథలైన చిన్నారులు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారికి మొదట ఒక కొడుకు పుట్టాడు. రెండో సంతానమూ మగ బిడ్డ పుట్టడంతో ఆ దంపతులు సంబరపడ్డారు. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. విధి వక్రించడంతో అనారోగ్యం బారిన పడి భార్య మృతిచెందింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య మృతిని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆమె లేని జీవితం తనకూ వద్దని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హృదయ విదారకమైన ఈ సంఘటన చిత్తూ జిల్లా చంద్రగిరి మండలం కొండ్రెడ్డి కండ్రిగలో బుధవారం చోటు చేసుకుంది. చంద్రగిరి: కొండ్రెడ్డి కండ్రిగ పంచా యతీ ఎస్టీ కాలనీకి చెందిన వెంకటరమణ(26), రేణుక(23) దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగి స్తున్నారు. వారికి ఏడాదిన్నర క్రితం కొడుకు పవన్‌కుమార్ జన్మించాడు. రెండోసారి గర్భం దాల్చిన రేణుక మూడు నెలల క్రితం చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిలో పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ కొడుకులు పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలను ప్రయోజకులను చేయాలని భావించారు. ఈ తరుణంలో రేణుక ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రేణుక ఆరోగ్యం విషమించడంతో వెంకటరమణ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు అధికంగా జన్ని రావడంతో మంగళవారం అర్ధరాత్రి ఇంటి వద్దే మృతి చెందింది. భార్య లేని బతుకు వద్దని.. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భార్య మృత్యువాత పడటంతో వెంకటరమణ తట్టుకోలేకపోయాడు. భార్య లేని జీవితం తనకూ వద్దని బుధవారం తెల్ల వారుజామున విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్ద రూ ఒకే రోజు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. చిన్నారులు పవన్ కుమార్, యశ్వంత్ అనాథలుగా మారారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద వారు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది. ఆ దంపతులకు గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహిం చారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని ఉప సర్పంచ్ విజయ్‌శేఖర్‌రెడ్డి తెలిపారు. దీనిపై వివరణ కోసం పీహెచ్సీ డాక్టర్ కల్యాణ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
భార్య మృతి కేసులో భర్తకు ఐదేళ్ల జైలు
గుంటూరు లీగల్: భర్త వేదింపులు భరించలేక కాలిన గాయాలతో భార్య మృతిచెందిన కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధిస్తూ ఒకటో అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎంవీ రమణ కుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరు నగర పరిధిలోని గోరంట్లకు చెందిన మల్లంపాటి అలియాస్ యాంపాటి రామిరెడ్డి కప్‌బోర్డుల పనిచేస్తుంటాడు. పనుల నిమిత్తం అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని ముద్దనపల్లి వెళ్ళాడు. అక్కడ సుధ అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి ఇరుపక్షాల పెద్దలు అంగీకరించ లేదు. చివరకు పెద్దమనుషులు జోక్యం చేసుకుని సంఘటనకు మూడు నెలలు ముందు ఇద్దరికీ తిరుపతిలో వివాహం చేశారు. వివాహం అనంతరం వారు గోరంట్లలో కాపురం పెట్టారు. సంఘటనకు వారం రోజుల ముందు సుధ పుట్టింటికి వెళ్తానని అడగటంతో రామిరెడ్డి ఆమెను కదిరి వరకు తీసుకెళ్లి పుట్టింటికి వెళ్ళమని చెప్పి తిరిగి గోరంట్లకు వచ్చేశాడు. తమ పుట్టింటికి రమ్మని భర్తను కోరినప్పటికి అతను నిరాకరించడంతో చేసేదిలేక ఆమే వెళ్ళింది. ఇంటి వద్ద తల్లితండ్రులు భర్త గురించి అడగడంతో కదిరి వరకు వచ్చి వెళ్ళాడని చెప్పడంతో ఆమె తండ్రి రామిరెడ్డిని ఫోన్లో మందలించాడు. ఈ విషయంపై రామిరెడ్డి వారిపై కోపం పెంచుకున్నాడు. అనంతరం 4 రోజులు గడిచాక రామిరెడ్డి సుధను ఆమె పుట్టింటి నుంచి గోరంట్లకు తీసుకొచ్చాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను వేధించడం ప్రారంభించాడు. మనస్తాపానికి గురై.. 2015 డిసెంబర్ 1న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోనే మద్యం తాగుతూ భార్యను దూషించాడు. మనస్థాపానికి గురైన సుధ ఇంట్లోకి వెళ్ళి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న మృతి చెందింది. జరిగిన సంఘటనపై నల్లపాడు పోలీసులు రామిరెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో జైలు శిక్ష, జరిమాన విధిస్తూ న్యాయమూర్తి రమణకుమారి తీర్పు చెప్పారు. ఏపీపీ పారి బాబూరావు ప్రాసిక్యూషన్ నిర్వహించగా అప్పటి సీఐ పూర్ణచంద్రరావు కేసు దర్యాప్తు చేశారు. -
రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ
గుంటూరు(నగరంపాలెం): నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి చిత్రపటం వద్ద వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మంగళవారం నివాళులర్పించారు. గుంటూరు లక్ష్మీపురంలోని రాయపాటి నివాసానికి వెళ్లి పలువురు నాయకులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగర్జున తదితరులు లీలాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఎంపీ రాయపాటి సాంబశివరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఐజీ ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, రిటైర్డు ఐజీ సీఆర్ నాయుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్, డాక్టర్ మండవ శ్రీనివాస్ తదితరులు రాయపాటిని పరామర్శించినవారిలో ఉన్నారు. -
భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు
రంగారెడ్డి: కట్నం వేధింపులతో భార్య బలవన్మరణానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... మీర్పేట్ త్రివేణి నగర్లో నివాసముండే దీపక్‌బాబు, సుచరిత దంపతుల వివాహం 2010 జూన్ నెలలో జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. దీపక్‌బాబు మరింత కట్నం తేవాలంటూ సుచరితను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఈ క్రమంలో 2013 ఏప్రిల్ 24న దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన సుచరిత అదే రోజు రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని మరణించింది. ఆమె తండ్రి ప్రకాష్ ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. దీపక్బాబుకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
అనంతలో కుటుంబకలహాలతో విషాదం..
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త మద్యం మానడం లేదని భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో..మనస్తాపం చెందిన భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రొద్దం మండలం దొడగట్ట గ్రామంలో జరిగింది. భర్త రంగనాథ్ మద్యం మానడం లేదని భార్య నాగలక్ష్మి(40) అనే గృహిణి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నాం మృతిచెందింది. దీంతో మనస్తాపం చెందిన భర్త రంగనాథ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగనాథ్ ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో వీరి పిల్లలిద్దరూ నిస్సాహాయక స్థితిలో ఉండిపోయారు. -
పాపం పిల్లలు..
- ప్రసవానంతరం తల్లి మృతి - ఆర్థిక సమస్యలతో తండ్రి ఆత్మహత్య ప్రొద్దుటూరు/ఎర్రగుంట్ల : ప్రసవానంతరం భార్య మృతి చెందడం, పురిటి బిడ్డ అనారోగ్యం పాలవ్వడం చూసి అర్థిక సమస్యల్లో ఉన్న అవిటి వాడైన తాను పిల్లలను పోషించలేననే దిగులుతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు.. ఎర్రగుంట్ల మండలం హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దానం, దీనమ్మల రెండవ సంతానం నాగరాజు (27). ఇతనికి కుడి చెయ్యి లేదు. భార్య సువర్ణ(22) వ్యవసాయ కూలీ పనులకెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. వీరికి అశ్వని అనే నాలుగేళ్ల చిన్నారి కలదు. ఈ నేపథ్యంలో సువర్ణ ఈనెల 19న కడప రిమ్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అధిక రక్తస్రావం కారణంగా రెండు రోజుల తర్వాత ఆమె మృతి చెందింది. పురుటిబిడ్డ అనారోగ్యానికి గురవ్వడంతో బంధువులు ఈ నెల 23న ప్రొద్దుటూరులోని గాయత్రి హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి కామెర్లతోపాటు ఇన్ఫెక్షన్ సోకినట్లు డాక్టర్ వీరప్రసాదరెడ్డి తెలిపారు. భార్య చనిపోయిన బాధ ఓ వైపు.. తల్లి లేని పిల్లలను ఎలా సాకాలన్న దిగులు మరో వైపు.. పైగా ఆర్థిక సమస్యలు.. తీవ్రంగా మధన పడిన నాగరాజు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారని తెలుసుకుని ఎర్రగుంట్ల సీఐ కేశవరెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్‌కు సమాచారం అందించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి శివప్రసాదరెడ్డి, ఐసీడీఎస్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరక్టర్ ఆదిలక్షుమ్మలు చిన్నారి చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి వచ్చా రు. ఎర్రగుంట్ల ఎస్ఐ నారాయణ యాదవ్‌తో వీరు చర్చించారు. బిడ్డను వారి బంధువులు దీనమ్మ, సుందరంలు పోషించుకుంటామని చెప్పారని ఎస్ఐ వారితో చెప్పారు. ఈ సందర్భంగా శివప్రసాదరెడ్డి, ఆదిలక్షుమ్మలు మాట్లాడుతూ మృతి చెందిన సువర్ణ, నాగరాజు దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉందని తెలిపారు. ఇద్దరినీ పోషిస్తామని మృతుల బంధువులు రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని, లేదంటే ఆ పిల్లలను తాము కడపలోని శిశు గృహలో చేర్పిస్తామన్నారు. పిల్లల బంధువులతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని ఎస్ఐ వారికి వివరించారు. ఎస్ఐ వెంట ఏఎస్ఐ చంద్రశేఖర్, ప్రాజెక్టు ఆఫీసర్ సునిత ఉన్నారు. అనాథలను చేర్పించండి.. అనాథలుగా ఉన్న చిన్నారులెవరినైనా శిశు గృహలో చేర్పించవచ్చునని జిల్లా బాలల సంరక్షణ అధికారి శివప్రసాదరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వారికి సరైన పోషణ అందించడంతోపాటు మంచి విద్యను కూడా అందిస్తామన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 8332972561 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. -
భార్య మృతితో మనస్తాపం చెంది.. భర్త ఆత్మహత్య
చిత్తూరు (సోదం): భార్య మృతి చెందడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోదం మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జోగివారిపల్లిలో వెంకటేశ్వరరెడ్డి (70) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే భార్య యశోదమ్మ(63) మూడేళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను వారం కిందట తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యశోదమ్మ గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో భార్యకు ఖరీదైన వైద్యం చేయించలేక పోతున్నానని వెంకటేశ్వరరెడ్డి స్థానికుల దగ్గర తరచూ ఆవేదన చెందుతుండేవారు. ఈ నేపథ్యంలో భార్య మృతి వార్త తెలియగానే ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డికి ఇద్దరు కుమారులు కాగా, వారు గతంలోనే మృతి చెందినట్లు సమాచారం. -
ప్రాణం తీసిన సరదా...
- శుభకార్యానికి వచ్చి.. - తుంగభద్రనదిలో దంపతుల గల్లంతు - రెండు కుటుంబాల్లో విషాదం సరదా ప్రాణం తీసింది.. బంధువుల శుభకార్యానికి వచ్చిన దంపతులు తుంగభద్ర అందాలను తిలకిచేందుకు వెళ్లి నదిలో గల్లంతయ్యారు. భార్య మృతిచెందగా, భర్త ఆచూకీ తెలియరాలేదు. ఈ సంఘటనతో ఆ సందడి ఒక్కసారిగా మూగబోయింది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం ఆవహించింది. అలంపూర్ : బంధువుల శుభకార్యానికి వచ్చిన దంపతుల సరదా ప్రాణాల మీదుకు తెచ్చింది. నదీ తీరంలో బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం దంపతుల గల్లంతుతో ఒక్కసారిగా విషాదంగా మారింది. సరదాగా విహరిద్దామని వచ్చిన వారు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆచూకీ తెలియరాలేదు. వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు నగరం ఖడక్‌పురకు చెందిన నూర్‌బాషా (26) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు అక్కడి బుధవారపేటకు చెందిన యాస్మిన్ (20) తో ఏడాదిక్రితం వివాహమైంది. ఈమెకు అలంపూర్ పట్టణానికి చెందిన యూసూఫ్బాషా వరుసకు చిన్నాన్న అవుతారు. అతని కుమారుడి పుట్టు వెంట్రుకలు కార్యక్రమం శుక్రవారం అలంపూర్ పట్టణంలోని తుంగభద్రా తీరంలో ఉన్న బీబీదర్గా వద్ద నిర్వహించారు. ఈ వేడుకలకు దంపతులతోపాటు బంధుమిత్రులు హాజరయ్యారు. భోజనాలు చేసిన వారు కొద్దిసేపు విహరించడానికి వెళ్లారు. ఎంతకూ తిరగి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకసాగారు. చివరకు సాయంత్రం యాస్మిన్ మృతదేహం కనిపించగా నూర్‌బాషా జాడ మాత్రంలేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పర్వతాలు, తహశీల్దార్ మంజుల పరిశీలించారు. స్థానిక గజ ఈతగాళ్లతో గల్లంతైన నూర్ బాషా కోసం అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.