husband suicide attempt
-
భర్త, పిల్లలు వద్దు ప్రియుడే కావాలి.. వీడియో కాల్స్ చేసి..
తుమకూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియునితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయిందో మహిళ. తరువాత కాల్స్ చేస్తూ ఆటపట్టిస్తోంది. ఈ హింసను తట్టుకోలేక ఆ భర్త ముగ్గురు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం కర్నాటకలో చోటుచేసుకుంది. వీడియో కాల్స్‌తో హేళన.. తుమకూరులోని పిహెచ్ కాలనీలో సమీవుల్లా (45) భార్య సాహెరా బాను, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సాహెరాబాను ప్రియునితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయింది. అప్పటినుంచి సమీవుల్లా ఒక్కడే ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును పోషిస్తూ జీవిస్తున్నాడు. మరోవైపు సాహెరా బాను దుబాయ్ నుంచి తన పిల్లలకు వీడియో కాల్ చేస్తూ హేళనగా మాట్లాడేది. ఈ పరిణామాలతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం ఉదయం పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా సేవించాడు. కొంతసేపటికే సమీవుల్లా చనిపోగా, పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అంబులెన్సులో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్ -
వరంగల్ :భార్య,కుమారుడి గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం
-
భార్య, కుమారుడి గొంతు కోసిన భర్త.. వరంగల్‌లో ఘటన
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కుమారుడి గొంతు కోసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ముగ్గురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివారాల్లోకి వెళ్తే.. పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీ చెందిన ప్రైవేట్ ఉద్యోగి జయవర్ధన్ చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక చివరకు తన కుటుంబాన్ని అంతమొందించుకోవాలకున్నాడు. భార్యను, కొడుకు గొంతు కోసి ఆపై తాను గొంతు కోసుకున్నాడు. ఇంతలో అతడి ఏడేళ్ల కుమార్తె భయంతో పరుగులు తీసి పక్కింటివారికి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జయవర్ధన్ లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై చేసిన అప్పులు తీర్చలేక భార్య, కుమారుడి గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితులను ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, నేలకొండపల్లి: భార్యను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడో భర్త. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని బీడులో మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన మాతంగి గంగాధర్, నవీన అనే భార్యాభర్తలు తమ ఇద్ద మగ పిల్లలతో నివసిస్తున్నారు. ఈ కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నవీనను చున్నీతో ఉరిబిగించి గంగాధర్ చంపాడు. అనంతరం అతను కూడా విష గిళికలు తిని ఆత్మహత్యకు యత్నించాడు. నేలకొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవపడి నిప్పంటించుకున్న భర్త
రాయదుర్గం అర్బన్ : భార్యతో గొడవపడి మనస్తాపానికి గురైన భర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయదుర్గం పట్టణంలోని శ్రీచౌడమ్మ గుడి ప్రాంతంలో నివాసముంటున్న భీమునిపల్లి హరి (35), కృష్ణవేణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు నిత్యం ఏదో ఒక విషయంపై గొడవపడేవారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన హరి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలకు బాధ తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు పరుగులు తీశాడు. స్థానికులు గమనించి, మంటలు ఆర్పి.. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ వసంతలక్ష్మి ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు సిఫార్సు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనంతలో కుటుంబకలహాలతో విషాదం..
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త మద్యం మానడం లేదని భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో..మనస్తాపం చెందిన భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రొద్దం మండలం దొడగట్ట గ్రామంలో జరిగింది. భర్త రంగనాథ్ మద్యం మానడం లేదని భార్య నాగలక్ష్మి(40) అనే గృహిణి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నాం మృతిచెందింది. దీంతో మనస్తాపం చెందిన భర్త రంగనాథ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగనాథ్ ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో వీరి పిల్లలిద్దరూ నిస్సాహాయక స్థితిలో ఉండిపోయారు.