భార్యతో గొడవపడి నిప్పంటించుకున్న భర్త | husband suicide attempt of wife issue | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవపడి నిప్పంటించుకున్న భర్త

Published Tue, Jun 27 2017 10:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

husband suicide attempt of wife issue

రాయదుర్గం అర్బన్‌ : భార్యతో గొడవపడి మనస్తాపానికి గురైన భర్త ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయదుర్గం పట్టణంలోని శ్రీచౌడమ్మ గుడి ప్రాంతంలో నివాసముంటున్న భీమునిపల్లి హరి (35), కృష్ణవేణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు నిత్యం ఏదో ఒక విషయంపై గొడవపడేవారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో గొడవపడ్డారు.

మనస్తాపానికి గురైన హరి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలకు బాధ తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు పరుగులు తీశాడు. స్థానికులు గమనించి, మంటలు ఆర్పి.. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్‌ వసంతలక్ష్మి ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు సిఫార్సు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement