wife issue
-
భార్యతో గొడవపడి నిప్పంటించుకున్న భర్త
రాయదుర్గం అర్బన్ : భార్యతో గొడవపడి మనస్తాపానికి గురైన భర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయదుర్గం పట్టణంలోని శ్రీచౌడమ్మ గుడి ప్రాంతంలో నివాసముంటున్న భీమునిపల్లి హరి (35), కృష్ణవేణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు నిత్యం ఏదో ఒక విషయంపై గొడవపడేవారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన హరి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలకు బాధ తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు పరుగులు తీశాడు. స్థానికులు గమనించి, మంటలు ఆర్పి.. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ వసంతలక్ష్మి ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు సిఫార్సు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
పుట్లూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన చాగంటి వెంకటరెడ్డి (38) అనే వ్యక్తి శుక్రవారం కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరెడ్డి మద్యానికి బానిస కావడంతో పలుమార్లు కుటుంబ సభ్యులు మందలించారు. ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మానక పోవడంతో భార్య కళ్యాణి కుమారుడు, కూతురిని తీసుకుని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సురేష్‌బాబు సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు.