
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
పుట్లూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన చాగంటి వెంకటరెడ్డి (38) అనే వ్యక్తి శుక్రవారం కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరెడ్డి మద్యానికి బానిస కావడంతో పలుమార్లు కుటుంబ సభ్యులు మందలించారు. ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మానక పోవడంతో భార్య కళ్యాణి కుమారుడు, కూతురిని తీసుకుని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది.
దీంతో మనస్థాపానికి గురైన అతడు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సురేష్‌బాబు సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు.