
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్‌లో శనివారం అర్థరాత్రి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. గంజాయి, మద్యం మత్తులో ఇరువర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. హాకీస్టిక్, రాడ్లు కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో నరసింహారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. నరసింహారెడ్డి మృతికి కారణమైన యువకుల నివాసంపై అతని బంధువులు దాడికి దిగారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్‌లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment