
ఓ చిన్నారి బార్‌కెళ్లి ప్యాకెట్ పాలు కావాలని అడిగింది. ఆశ్యర్యపోయిన బార్ సిబ్బంది చిన్నారిని బాధపెట్టడం ఇష్టం లేక ఆ పాపకు పాలు సర్వ్ చేసి తిరిగి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో, స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. మైలా అండర్సన్ అనే మూడేళ్ల చిన్నారి సెలవులు ఎంజాయ్ చేయడానికి కుటుంబంతో కలిసి క్రొయేషియాలోని డుబ్రోవింక్ వెళ్లింది. అక్కడ కుటుంబంతో కలిసి ఓ హోటల్‌లో దిగింది. ఈ క్రమంలో ఓ రోజు తల్లిదండ్రులు ఇద్దరు సన్‌బాత్ కోసం స్విమింగ్ పూల్ దగ్గరకు వెళ్లారు. అలా వెళ్లేటప్పుడు మైలా కోసం పాల ప్యాకెట్‌ని ఆమె బ్యాగ్‌లో పెట్టడం మర్చిపోయారు. తల్లిదండ్రులతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లిన మైలాకు కొద్ది సేపటి తర్వాత ఆకలి వేయసాగింది.
తల్లి దగ్గరకు వెళ్లి తాగడానికి పాలు కావాలని అడిగింది మైలా. తల్లి పాలు తీసుకురావడం మర్చిపోయానని చెప్పడంతో మైలా వెంటనే పక్కనే ఉన్న ఓ బార్‌లోకి వెళ్లింది. తనకు ఓ ప్యాకెట్ పాలు కావాలని అక్కడి సిబ్బందిని అడిగింది. ఏం చెప్పాలో అర్థంకాని సిబ్బంది ఇక్కడ గ్లాస్‌లు మాత్రమే దొరుకుతాయని చెప్పారు. అందుకు మైలా పర్వాలేదు.. ఓ గ్లాస్ చాలు అంటూ అక్కడే ఉన్న కుర్చీ మీద కూర్చుంది. తన ఆర్డర్ కోసం ఓపికగా ఎదురు చూడసాగింది. మైలా ధైర్యానికి ఆశ్చర్యపోయిన సిబ్బంది.. ఆ చిన్నారి కోరినట్లు ఓ గ్లాస్‌లో పాలు తీసుకు వచ్చారు. అవి తాగి మైలా అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను మైలా తండ్రి తన ట్విటర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. నెటిజన్లు మైలా ధైర్యానికి ఫిదా అవుతున్నారు. ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
My daughter is actually something else. We told her there was no milk in the baby bag so she got out the pool and took herself to the bar to go and ask for some and the bar staff actually served her a glass 😂😂 pic.twitter.com/AxhKZK1Soj
— Ben Anderson (@IAmBenAnderson) August 26, 2019
Comments
Please login to add a commentAdd a comment