ఎవరిదో..? | drunken man forget he's artificial leg | Sakshi
Sakshi News home page

ఎవరిదో..?

Published Sun, Mar 6 2016 4:23 AM | Last Updated on Thu, Jul 26 2018 1:02 PM

ఎవరిదో..? - Sakshi

ఎవరిదో..?

డోసు ఎక్కువైతే మందుబాబులు తమను తాము మరిచిపోయి... వీరంగం వేయడం చూస్తుంటాం. అలాగే మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను మర్చిపోవడమో, పారేసుకోవడమో చేస్తుంటారు. అయితే బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌లో ఓ దివ్యాంగుడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. గురుడు బాగా తాగేసి... తన కృత్రిమకాలును బార్ ముందు వదిలేసి వెళ్లిపోయాడు. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఫూటుగా తాగి... చేతిలో బీరు బాటిల్‌తో బయటకు వచ్చిన అతను బార్ మూతపడ్డాక దాని ముందే పేవ్‌మెంట్‌పై కూర్చొని మందుకొట్టాడు. ఆ క్రమంలో కృత్రిమకాలును తీసి పక్కన అలా నిలబెట్టాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయినట్లున్నాడు. ఎందుకంటే కృత్రిమకాలు వెనకే సగం ఖాళీ చేసిన బీరు సీసా కూడా కనిపిస్తోంది. ఈ కాలును ఫొటో తీసి యార్క్‌షైర్ ఫేస్‌బుక్ పేజీలో ఎవరో పోస్ట్ చేశారు. ‘రాత్రి ఎవరైనా డోంకస్టర్‌లో కృత్రిమకాలును పోగొట్టుకున్నారా?’ అని క్యాప్షన్ పెట్టారు. దాంతో రకరకాల కామెంట్లతో ఈ ఫొటో సోషల్ సైట్లలో చక్కర్లు కొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement