Artificial leg
-
‘కాలు’ తీసి చూస్తే కరెన్సీ
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహాన్ని అక్కడి హై గ్రౌండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో అతని కృత్రిమ కాలు బరువుగా అనిపించడంతో తీసి చూడగా అందులో రూ.96,780 నగదు లభించింది. అతడి వివరాలు ఆరా తీయగా అతడి పేరు షరీఫ్ సాబ్‌గాను, స్వస్థలం హైదరాబాద్ అని బయటపడింది. నగదుతో పాటు మృతదేహాన్ని అప్పగించేందుకు షరీఫ్ సంబంధీకుల వివరాలు ఆరా తీస్తున్నట్లు హౌ గ్రౌండ్ ఠాణా సబ్ ఇన్స్పెక్టర్ గాడేగ్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. మృతదేహంతో పాటు లభించిన కరెన్సీ ఫొటోలను ఆయన మీడియాకు విడుదల చేశారు. దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వెళ్లిన షరీఫ్ సాబ్ (75) బెంగళూరులో స్థిరపడ్డాడు. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నాళ్లు చిన్నా చితకా పనులు చేసినా ఆపై భిక్షాటనే వృత్తిగా మార్చుకున్నాడు. కాగా 12 ఏళ్ల క్రితం గాంగ్రిన్ కారణంగా షరీఫ్ కుడికాలు తొలగించి ఆ స్థానంలో కృత్రిమ కాలును ఏర్పాటు చేశారు. స్థానికులకు షరీఫ్ సాబ్‌గా సుపరిచితుడైన ఈ వృద్ధుడు తాను బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బులో ఖర్చులు పోను మిగిలింది తన కృత్రిమ కాలులోనే దాచుకునే వాడు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయ్‌లెట్‌కు వెళ్లిన అతను అక్కడే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని పరిశీలించిన రైల్వే పోలీసులు చనిపోయినట్లు నిర్థారించి హై గ్రౌండ్ ఠాణాకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై గాడ్గ్కే మృతదేహాన్ని శివాజీ నగర్‌లోని బౌరే ప్రభుత్వం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అతడి కృత్రిమ కాలు బరువుగా ఉండటాన్ని గుర్తించిన అతను స్థానికుల సాయంతో కాలును తీసి చూడగా... అందులో కరెన్సీ బయటపడింది. లెక్కించగా... 42 రూ.500 నోట్లు, 470 రూ.100 నోట్లు, 20 రూ.200 నోట్లు, 215 రూ.50 నోట్లు, 430 రూ.20 నోట్లు, 528 రూ.10 నోట్లతో పాటు కొంత చిల్లరతో కలిపి మొత్తం రూ.96,780 లెక్కతేలింది. ఈ నగదును స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని బౌరే ఆస్పత్రిలో భద్రపరిచారు. షరీఫ్ తరచూ బౌరే ఆస్పత్రితో పాటు అక్కడి విక్టోరియా ఆస్పత్రికీ వెళ్లి వైద్యం చేయించుకునే వాడని తేలింది. దీంతో గాడ్గే్క ఆ రెండు ఆస్పత్రుల్లోనూ ఆరా తీయగా కొందరు సిబ్బంది, రోగులు షరీఫ్‌ను గుర్తించారు. తాను హైదరాబాద్‌కు చెందిన వాడినంటూ తమతో చెప్పే వాడని వారు పోలీసులకు తెలిపారు. అక్కడ ఉండే తన సోదరి సైతం కొన్నాళ్ల క్రితం చనిపోయిందని తమకు చెప్పాడని వివరించారు. ఈ విషయంపై గాడ్గ్కే ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ప్రస్తుతం మృతదేహానికి పంచనామా నిర్వహించి బౌరే ఆస్పత్రిలో భద్రపరిచాం. మరో వారం రోజుల పాటు సంబంధీకుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తాం. ఆ గడువు పూర్తయిన తర్వాత చట్ట పరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి పోస్టుమార్టం నిర్వహిస్తాం. ఆపై మృతదేహాన్ని మున్సిపాలిటీ అధికారుల సాయంతో ఖననం చేయాలని భావించాం. అయితే స్థానిక మైనార్టీ పెద్దలు కొందరు తమకు కలిసి ఓ ప్రతిపాదన చేశారు. షరీఫ్ కుటుంబీకుల కోసం తామూ ప్రయత్నిస్తామని... ఆచూకీ లభించని నేపథ్యంలో పోస్టుమార్టం పరీక్షల తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు. మతాచారాల ప్రకారం తామే ఖననం పూర్తి చేస్తామని, స్వాధీనమైన నగదు మాత్రం ప్రభుత్వానికి అందించాలని సూచించారు’ అని అన్నారు. షరీఫ్ సాబ్ కుటుంబీకులు, బంధువులు, సంబంధీకులు ఎవరైనా హైదరాబాద్‌లో ఉంటే బెంగళూరులో ని హై గ్రౌండ్ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
-
ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
దుబాయ్‌లో ఇటీవల ఐసీసీ అకాడెమీ ఇన్విటేషనల్ టీ20 టోర్నమెంట్ సందర్భంగా అరుదైన ఘటన జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ దిశగా దూసుకుపోతున్న బంతిని ఇంగ్లండ్ క్రికెటర్ లియాయ్ థామస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. కాలు ఊడిపోయినా అతను మాత్రం వెనక్కితగ్గలేదు. ఒంటికాలితో కుంటుతూ బంతిని కీపర్‌కు విసిరేసి.. అందరి మన్ననలు అందుకున్నాడు. లియామ్ థామస్ దివ్యాంగుడు. ఇంగ్లండ్ దివ్యాంగుల క్రికెట్ టీమ్‌లో సభ్యుడైన అతడు ఇటీవల పాకిస్థాన్ దివ్యాంగుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ విధంగా అసాధారణ ప్రతిభ చూపాడు. బౌండరీ వెళుతున్న బంతిని డైవ్ చేసి అడ్డుకోబోతుండగా.. అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. అయినా, ఒంటికాలితో కుంటుతూ వెళ్లి బంతిని అందుకొని.. కీపర్‌కు అందించాడు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బంతిని అందుకునే క్రమంలో భూమిని బలంగా ఢీకొన్నా. ఆ తర్వాత నేను లేచేందుకు ప్రయత్నించగా ఒక కాలు లేదు. ముందు ఊడిపోయిన కాలును పెట్టుకోవాలా? లేక బంతిని అందుకోవాలా? అన్న సందిగ్ధ పరిస్థితి. కానీ బంతికే నేను ప్రాధాన్యం ఇచ్చాను' అని మ్యాచ్ అనంతరం థామస్ తెలిపారు. ' వైకల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరినొకరు చూసుకొని కొంత నవ్వుకుంటాం. కానీ నిజానికి ఇలాంటి ఘటనల్లో ఒకరి బాధ మరొకరికి తెలుస్తుంది' అని చెప్పాడు. లియామ్ థామస్ ఈ ఫీల్డింగ్ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
ఆ గుర్రానికి కాలొచ్చింది!
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బీజేపీ నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శక్తిమాన్ అనే గుర్రానికి కృత్రిమ కాలు అమర్చారు. ఇందుకోసం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. గుర్రం లేచి తన కొత్త కాలుమీద నిలబడిందని, దాంతో ఆపరేషన్ విజయవంతం అయినట్లేనని దానికి ఆపేరషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు. గుర్రం కాలు తీవ్రంగా గాయపడటం, దాన్ని అలాగే ఉంచేస్తే గాంగరిన్ కారణంగా అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును అంతకుముందు తీసేశారు. గుర్రాన్ని పదేపదే కర్రతో కొట్టారని ఆరోపణలు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాన్ని సందర్శించారు. అయితే తాను అసలు దాన్ని కొట్టనే లేదని, మూగజీవి బాధపడుతోందన్న ఆవేదనతోనే ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు. వాస్తవానికి గుర్రం తీవ్రంగా గాయపడిన దృశ్యాల్లో ఎమ్మెల్యే జోషి కర్రతో ఉన్నట్లు కనిపించినా, ఆయన దాన్ని కొట్టిన దృశ్యాలు మాత్రం ఎక్కడా లేవు. మరో వ్యక్తి మాత్రం శక్తిమాన్ మీద పోలీసు స్వారీ చేస్తుండగా దాని కళ్లెం పట్టుకుని లాగేశాడు. దాంతో అది కింద పడిపోయింది. సదరు వ్యక్తిని వీడియో ఫుటేజిలో గుర్తించి, అరెస్టు చేశారు. గడిచిన మూడు రోజులుగా గుర్రాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సహా పలువురు నాయకులు పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న గుర్రం గాయపడినందుకు తాను ఎంతో బాధపడుతున్నానని, ఇది ఒక క్షతగాత్రుడైన సైనికుడితో సమానమని ఆయన అన్నారు. -
ఎవరిదో..?
డోసు ఎక్కువైతే మందుబాబులు తమను తాము మరిచిపోయి... వీరంగం వేయడం చూస్తుంటాం. అలాగే మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను మర్చిపోవడమో, పారేసుకోవడమో చేస్తుంటారు. అయితే బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌లో ఓ దివ్యాంగుడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గురుడు బాగా తాగేసి... తన కృత్రిమకాలును బార్ ముందు వదిలేసి వెళ్లిపోయాడు. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఫూటుగా తాగి... చేతిలో బీరు బాటిల్‌తో బయటకు వచ్చిన అతను బార్ మూతపడ్డాక దాని ముందే పేవ్‌మెంట్‌పై కూర్చొని మందుకొట్టాడు. ఆ క్రమంలో కృత్రిమకాలును తీసి పక్కన అలా నిలబెట్టాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయినట్లున్నాడు. ఎందుకంటే కృత్రిమకాలు వెనకే సగం ఖాళీ చేసిన బీరు సీసా కూడా కనిపిస్తోంది. ఈ కాలును ఫొటో తీసి యార్క్‌షైర్ ఫేస్బుక్ పేజీలో ఎవరో పోస్ట్ చేశారు. ‘రాత్రి ఎవరైనా డోంకస్టర్‌లో కృత్రిమకాలును పోగొట్టుకున్నారా?’ అని క్యాప్షన్ పెట్టారు. దాంతో రకరకాల కామెంట్లతో ఈ ఫొటో సోషల్ సైట్లలో చక్కర్లు కొట్టింది. -
బయోనిక్ కాలు...
ప్రమాదవశాత్తూ లేదంటే కొన్ని అరుదైన వ్యాధుల కారణంగా కాళ్లు చేతులు చచ్చుబడిపోయిన వారిని మనం చూస్తూనే ఉంటాం. ఏళ్లతరబడి ఫిజియోథెరపీ చేయించినా, ఎన్ని రకాల మందులు వాడినా వీరిలో కొందరి పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండదు. అటువంటి వారికి కొంచెం స్వాంతనిచ్చే వార్త ఇది. అమెరికాలోని ఓ కంపెనీ చచ్చుబడిపోయిన కాళ్లకు మళ్లీ కదలికల తాలూకూ ‘జ్ఞానాన్ని’ అందించేందుకు ఓ అత్యాధునిక కృత్రిమ కాలును తయారు చేసింది. దీన్ని తగిలంచుకుంటే అందులోని సెన్సర్లు, రోబోల సాయంతో మళ్లీ నడవవచ్చునని అంటోంది. కండరాలు సక్రమంగా తమ శక్తిని ఉపయోగించుకునేందుకు తద్వారా కదలికలను ప్రేరేపించేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.