
బయోనిక్ కాలు...
ప్రమాదవశాత్తూ లేదంటే కొన్ని అరుదైన వ్యాధుల కారణంగా కాళ్లు చేతులు చచ్చుబడిపోయిన వారిని మనం చూస్తూనే ఉంటాం. ఏళ్లతరబడి ఫిజియోథెరపీ చేయించినా, ఎన్ని రకాల మందులు వాడినా వీరిలో కొందరి పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండదు. అటువంటి వారికి కొంచెం స్వాంతనిచ్చే వార్త ఇది. అమెరికాలోని ఓ కంపెనీ చచ్చుబడిపోయిన కాళ్లకు మళ్లీ కదలికల తాలూకూ ‘జ్ఞానాన్ని’ అందించేందుకు ఓ అత్యాధునిక కృత్రిమ కాలును తయారు చేసింది. దీన్ని తగిలంచుకుంటే అందులోని సెన్సర్లు, రోబోల సాయంతో మళ్లీ నడవవచ్చునని అంటోంది. కండరాలు సక్రమంగా తమ శక్తిని ఉపయోగించుకునేందుకు తద్వారా కదలికలను ప్రేరేపించేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.