ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
దుబాయ్‌లో ఇటీవల ఐసీసీ అకాడెమీ ఇన్విటేషనల్ టీ20 టోర్నమెంట్ సందర్భంగా అరుదైన ఘటన జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ దిశగా దూసుకుపోతున్న బంతిని ఇంగ్లండ్ క్రికెటర్ లియాయ్ థామస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. కాలు ఊడిపోయినా అతను మాత్రం వెనక్కితగ్గలేదు. ఒంటికాలితో కుంటుతూ బంతిని కీపర్‌కు విసిరేసి.. అందరి మన్ననలు అందుకున్నాడు. లియామ్ థామస్ దివ్యాంగుడు. ఇంగ్లండ్ దివ్యాంగుల క్రికెట్ టీమ్‌లో సభ్యుడైన అతడు ఇటీవల పాకిస్థాన్ దివ్యాంగుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ విధంగా అసాధారణ ప్రతిభ చూపాడు. బౌండరీ వెళుతున్న బంతిని డైవ్ చేసి అడ్డుకోబోతుండగా.. అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. అయినా, ఒంటికాలితో కుంటుతూ వెళ్లి బంతిని అందుకొని.. కీపర్‌కు అందించాడు.
ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బంతిని అందుకునే క్రమంలో భూమిని బలంగా ఢీకొన్నా. ఆ తర్వాత నేను లేచేందుకు ప్రయత్నించగా ఒక కాలు లేదు. ముందు ఊడిపోయిన కాలును పెట్టుకోవాలా? లేక బంతిని అందుకోవాలా? అన్న సందిగ్ధ పరిస్థితి. కానీ బంతికే నేను ప్రాధాన్యం ఇచ్చాను' అని మ్యాచ్ అనంతరం థామస్ తెలిపారు. ' వైకల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరినొకరు చూసుకొని కొంత నవ్వుకుంటాం. కానీ నిజానికి ఇలాంటి ఘటనల్లో ఒకరి బాధ మరొకరికి తెలుస్తుంది' అని చెప్పాడు. లియామ్ థామస్ ఈ ఫీల్డింగ్ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.