ఇంగ్లండ్‌ లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత.. | Ex-England batter Graham Thorpe passes away at 55 years of age | Sakshi
Sakshi News home page

Graham Thorpe: ఇంగ్లండ్‌ లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత..

Published Mon, Aug 5 2024 1:35 PM | Last Updated on Mon, Aug 5 2024 1:57 PM

Ex-England batter Graham Thorpe passes away at 55 years of age

ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  ఇంగ్లండ్ లెజెండ‌రీ క్రికెట‌ర్‌ గ్రాహం థోర్ప్(55) క‌న్నుముశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న గ్రాహం థోర్ప్.. ఆదివారం ఆర్ధ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువీక‌రించింది. ఈ దివంగత క్రికెటర్‌కు ఈసీబీ ఎక్స్ వేదిక‌గా నివాళులు అర్పించింది.

"ఈ రోజు వ‌ర‌ల్డ్ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దిగ్గ‌జ క్రికెట‌ర్ గ్రాహం థోర్ప్ మ‌ర‌ణ వార్త‌ను బ‌రువెక్కిన హృదయాలతో మేము పంచుకుంటున్నాము. అతడి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని ఈసీబీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.

థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్‌లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 341 మ్యాచ్‌ల్లో 21937 ప‌రుగులు చేశారు.

గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ త‌ర్వాత ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా ప‌నిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓట‌మి చవిచూడ‌టంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా థోర్ప్ ఎంపిక‌య్యారు. కానీ హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే ఆయ‌న అనారోగ్యం బారిన ప‌డ్డారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement