Graham Thorpe
-
తనవల్లే ఈ స్ధాయిలో ఉన్నా.. ఆయనకే ఈ సెంచరీ అంకితం: రూట్
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతులు ఎదుర్కొన్న రూట్.. 18 ఫోర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేకాకుండా టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన అలస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు చేయగా.. రూట్ కేవలం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఆయనకే సెంచరీ అంకితం...ఇక జో రూట్ తన 33వ టెస్ట్ సెంచరీని ఇంగ్లండ్ దివంగత మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌కు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మెంటార్ థోర్ప్‌కు నివాళులర్పించాడు. తన సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే రూట్ ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణాన ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు."నా కెరీర్లో ఇప్పటివరకు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లు, మెంటార్లతో కలిసి పనిచేశాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా కెరీర్‌ను తీర్చిదిద్దిన వారిలో గ్రాహం థోర్ప్ ఒకరు. ఈ క్షణంలో థోర్ప్‌ను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఆయనను చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్పటికి థోర్ప్‌కు రుణపడి ఉంటాను. నా ఆట, నా కెరీర్ ఎదుగుదలలో ఆయనది కీలక పాత్ర. ఈ స్ధాయిలో నేను ఉన్న అంటే కారణం థోర్ప్ అని గర్వంగా చెబుతున్నాను.బ్యాటింగ్ టెక్నిక్, స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు నాకు చాలా సహాయం చేశాడరు. ఈ రోజు నేను స్వీప్ షాట్లను సులభంగా ఆడుతున్న అంటే కారణం ఆయనే. నా సెంచరీని థోర్పీకి అంకితమివ్వాలనకుంటున్నాను అని తొలి రోజు ఆట అనంతరం రూట్ పేర్కొన్నాడు. కాగా థోర్ప్ ఈ నెల ఆరంభంలో అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. -
నరకప్రాయం.. నాకే ఎందుకిలా అనే భావన : ఊతప్ప
ఒకానొక దశలో తాను కూడా తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యానని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. నిరాశ నిస్పృహలో కూరుకుపోయి.. అసలు ఎందుకు బతికి ఉన్నానో తెలియని మానసిక స్థితిలోకి వెళ్లిపోయానన్నాడు. దాదాపు ఏడాది పాటు తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడిపోయానంటూ 2011 నాటి తన దుస్థితిని వివరించాడు.కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, అతడిది సహజ మరణం కాదని.. బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రాహమ్ భార్య అమెండా వెల్లడించారు. ఒత్తిడిని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.డిప్రెషన్.. నరకప్రాయం ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. డిప్రెషన్, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశాడు. కారణం లేకుండానే తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం నరకప్రాయంగా ఉంటుందని తెలిపాడు. అంతబాగానే ఉన్నా మనల్ని ప్రేమిస్తున్న వారికి భారంగా మారామనే ఆలోచన కుంగిపోయేలా చేస్తుందని వాపోయాడు.అయితే, ఇలాంటి సమయంలో బలహీనపడకుండా కాస్త స్థిమితంగా ఉంటే.. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు.. మనల్ని ప్రేమించే వాళ్లకూ గుండెకోత లేకుండా చేయగలమని ఊతప్ప పేర్కొన్నాడు. తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘2011... అసలు నేను ఎందుకు మనిషి జన్మ ఎత్తానా? అనే భావనలో ఉండిపోయేవాడిని. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడే వాడిని కాదు.అద్దం చూడలేదుఆ ఏడాదంతా అస్సలు అద్దం వైపే చూడలేదు. నా ఉనికి నా చుట్టూ ఉన్నవాళ్లకు భరించలేనిదిగా మారిందేమోనని సతమతమయ్యేవాడిని. నాకసలు విలువ లేదని అనిపించేది. నిస్సహాయత, నిరాశలో కూరుకుపోయాను. వారాలు.. నెలల.. సంవత్సరాల పాటు నా గదికే పరిమితమైతే బాగుంటుందని అనుకునేవాడిని.త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుందిఅయినా.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాధ ఒక్కరోజు ఉంటుందేమో!.. ఆ మరుసటి రోజు బాగుండవచ్చు కదా!.. మనం సాగుతున్న దారిలో చివరికంటా వెలుగు ఉండాలని ఆశించకూడదు. మరో అడుగు ముందుకు వేయడానికి దారి కనిపిస్తే చాలనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే.. గడ్డుకాలం ఎల్లకాలం ఉండదు. త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుంది అని అనుకుంటూ ముందుకు సాగితే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప ఒత్తిడిని అధిగమించే మార్గం కూడా చెప్పాడు. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు.టీమిండియాలో రాని అవకాశాలుటీమిండియా తరఫున 46 వన్డేలు ఆడి 934, 13 టీ20లు ఆడి 249 పరుగులు చేసిన ఊతప్ప.. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభించిన రెండేళ్లపాటు వరుస అవకాశాలు అందుకున్న ఈ కర్ణాటక క్రికెటర్.. 2009 నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు కరువుకాగా.. 2015లో భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఊతప్ప రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు.చదవండి: ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లో ఆడతా: స్మిత్ -
నా భర్తది ఆత్మహత్య: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ భార్య
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్‌ది సహజ మరణం కాదని అతడి భార్య అమెండా తెలిపారు. శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడని విచారం వ్యక్తం చేశారు. తనను ప్రేమించే, తాను ప్రేమించే భార్యాపిల్లలు ఉన్నా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒత్తిడిని అధిగమించలేకే తమకు శాశ్వతంగా దూరమైపోయాడని ఉద్వేగానికి గురయ్యారు.కాగా 55 ఏళ్ల థోర్ప్ మరణవార్త ఆగష్టు 5న వెల్లడైంది. 2022లో అఫ్గానిస్తాన్‌కు హెడ్ కోచ్‌గా నియమితుడైన థోర్ప్.. అప్పటి నుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అయితే స్పష్టమైన వ్యాధి, ఏ రకమైన అనారోగ్యమన్న సంగతి మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా... ఆయన భార్య అమెండా వ్యాఖ్యలతో థోర్ప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం బయటకు వచ్చింది.‘ది టైమ్స్’తో అమెండా మాట్లాడుతూ.. ‘‘తను మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మేము కూడా అతడిపై ప్రేమను కురిపించేవాళ్లం. గత కొన్నాళ్లుగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసేందుకు మేమెంతగానో ప్రయత్నించాం. కానీ తను శారీరక, మానసిక సమస్యలతో పోరాడలేక విసుగుచెందాడు.అందుకే తనను తాను అంతం చేసుకున్నాడు. గత రెండేళ్లుగా అతడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 2022లో తొలిసారి ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కాస్త తేలికపడ్డా.. మళ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఈసారి మాత్రం కోలుకోలేకపోయాడు. మెరుగైన చికిత్స అందించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అతడిని కాపాడుకోలేకపోయాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక థోర్ప్ కుమార్తె కిట్టీ మాట్లాడుతూ.. ‘‘జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి.. కానీ ఇలా చేశారు. ఆయన అలా ఒత్తిడిలో కుంగిపోతే చూసి మా గుండె పగిలిపోయింది. నాన్న శరీరంలో వేరే ఎవరో చొరబడి ఇలా చేసారేమో అన్నంత బాధ కలుగుతోంది. నాన్న చాలా మంచివారు. ఆయన మరణవార్త తెలియగానే చాలా మంది స్పందించారు. అందుకు మాకు కాస్త సంతోషంగా అనిపించింది. ఆయనను గుర్తుపెట్టుకున్న వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొంది.కాగా ఎడంచేతి బ్యాటర్ అయిన థోర్ప్ 1993 నుంచి 2005 వరకు తన కెరీర్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్ జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించాడు. 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6,744 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలున్నాయి. 82 అంతర్జాతీయ వన్డేలు ఆడి 37.18 సగటుతో 2,830 పరుగులు సాధించాడు. కౌంటీ జట్టు సర్రేతో థోర్ప్‌ది సుదీర్ఘబంధం! అండర్–11 స్థాయిలోనే ఆ జట్టులో చేరిన థోర్ప్ ఏకంగా 17 ఏళ్ల పాటు సేవలందించి దాదాపు 20 వేల పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ ముగిశాక కోచ్‌గానూ పని చేశాడు. -
ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత..
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గ్రాహం థోర్ప్.. ఆదివారం ఆర్ధ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఈ దివంగత క్రికెటర్‌కు ఈసీబీ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది."ఈ రోజు వరల్డ్ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన హృదయాలతో మేము పంచుకుంటున్నాము. అతడి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని ఈసీబీ ఎక్స్‌లో రాసుకొచ్చింది.థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు.గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓటమి చవిచూడటంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ హెడ్ కోచ్‌గా థోర్ప్ ఎంపికయ్యారు. కానీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. It is with great sadness that we share the news that Graham Thorpe, MBE, has passed away.There seem to be no appropriate words to describe the deep shock we feel at Graham's death. pic.twitter.com/VMXqxVJJCh— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024 -
Horoscope Today: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.నవమి తె.5.40 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి దశమి, నక్షత్రం: మఖ సా.6.41 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.3.16 నుండి 5.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.36 వరకు, తదుపరి ప.2.20 నుండి 3.05 వరకు, అమృతఘడియలు: రా.3.13 నుండి 5.01 వరకు; రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు; సూర్యోదయం 6.09; సూర్యాస్తమయం 5.21. మేషం: పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. వృషభం: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కన్య: శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వృశ్చికం: బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా కొనసాగుతాయి. మకరం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. చిత్రమైన సంఘటనలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. మీనం: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు. దైవదర్శనాలు చేసుకుంటారు. -
ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు..!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నియమితుడయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్రాహం థోర్ప్ స్థానంలో ట్రాట్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది మేలో తీవ్ర అస్వస్థతకు గురైన గ్రాహం థోర్ప్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఐర్లాండ్ సిరిస్‌తో ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన కోచ్‌గా ట్రాట్ ప్రయాణం మొదలుకానుంది. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ట్రాట్.. ఇంగ్లండ్‌కు 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ట్రాట్ 127 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 6792 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో 13 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు ఉన్నాయి. ట్రాట్ గతంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు మెంటార్‌గా, ఇంగ్లండ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. చదవండి: ZIM vs BAN: జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..! -
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్
లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహం థోర్ప్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ప్లేయర్స్ యూనియన్ మంగళవారం వెల్లడించింది. థోర్ప్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ప్రస్తుతం అతని కండీషన్ క్రిటికల్‌గా ఉందని యూనియన్ పేర్కొంది. థోర్ప్ కుటుంబం విజ్ఞప్తి మేరకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా, గ్రహం థోర్ప్ ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. థోర్ప్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం థోర్ప్ ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. చదవండి: బీజేపీ మీటింగ్‌కు హాజరుకానున్న రాహుల్ ద్రవిడ్..? -
ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..
లండన్: లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ గతంలో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. 27 ఏళ్ల రాబిన్సన్ 2012-13లో ట్విటర్ వేదికగా చేసిన జాత్యాంహకార వ్యాఖ్యలే ఇందుకు కారణం. దాదాపు ఎనిమిదేళ్ల కిందట రాబిన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ తాజాగా వెలుగుచూడటంతో, అతనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అంశంపై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహం థోర్ఫ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా చరిత్ర ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనని వ్యాఖ్యానించాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, రాబిన్సన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి లింగ పక్షపాతంతో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని క్షమాణలు చెప్పాడు. గతంలో తన చర్యల వల్ల సిగ్గుపడుతున్నానని, దయ చేసి సభ్య సమాజం తనను మన్నించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, బుధవారం న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో డెవాన్ కాన్వే అద్భుత ద్విశతకం సాయంతో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మీడియం పేసర్ ఒలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81), జేమ్స్ ఆండర్సన్(2/83)లకు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే డామినిక్ సిబ్లీ(0), జాక్ క్రాలీ(2)ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోరీ బర్న్స్(59 నాటౌట్), కెప్టెన్ జో రూట్(42 నాటౌట్) ఆదుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టానికి 111 పరుగులు సాధించింది. చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. -
ఆ క్రికెటర్ రెండో టెస్టులో ఆడనున్నాడు
సాక్షి, లండన్: భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో రెండో టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాహం థోర్‌్ప ప్రకటించాడు. తొలుత బెయిర్‌స్టోకు తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించాలని భావించిన ఆ జట్టు మేనేజ్మెంట్.. అనూహ్యంగా అతను రెండో టెస్ట్‌కు జట్టుతో కలుస్తాడని ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ జో రూట్ తరువాత అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టోను తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించడంపై విమర్శలు రావడంతో మేనేజ్మెంట్ అతన్ని రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో చేజిక్కించుకోగా, అందులో బెయిర్‌స్టో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 46.33 సగటుతో 139 పరుగులు సాధించాడు. కాగా, భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు రోటేషన్ పద్ధతి కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్క్ వుడ్, సామ్ కర్రన్, బెయిర్‌స్టోలకు ఆ జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్ ఇదే వేదికగా ఫిబ్రవరి 13న, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్, ఇదే వేదికలో మార్చి 4న నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్నాయి. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనలో 4 టెస్ట్‌లు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. -
‘ఇంకా ఆట ముగిసిపోలేదు’
లీడ్స్: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు ఆలౌటైతే, ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లు మాత్రమే ఆడి 67 పరుగులకే చాపచుట్టేసింది. ఇది టెస్టు క్రికెట్ చరిత్రలో 12వ స్వల్ప స్కోరు కాగా, 1948 తర్వాత ఆసీస్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్పం. కాగా, మ్యాచ్‌పై ఆశలు కోల్పోవద్దని ఇంగ్లండ్‌కు దిశా నిర్దేశం చేస్తున్నాడు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాహమ్ థోర్ప్. ‘ ఇంకా మ్యాచ్ చాలా ఉంది. గేమ్ అప్పుడే ఆసీస్ చేతుల్లోకి వెళ్లిపోయిందనే భయాన్ని వీడండి. మూడో రోజు ఆటలో ఆసీస్‌ను కట్టడి చేస్తే మనదే పైచేయి అవుతుంది. గతంలో ఇక్కడ మూడొందల టార్గెట్‌ను ఛేదించిన సందర్భాలున్నాయనే విషయాన్ని మరవకండి. నమ్మకమే గెలుపు. ఆత్మవిశ్వాసంతో పోరాడండి’ అని ఇంగ్లండ్‌ను గాడిలో పెట్టే పనిలో పడ్డాడు థోర్ప్. ప్రస్తుతం ఆస్ట్రేలియా 283 పరుగుల ఆధిక్యంలో ఉంది. తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులతో ఉంది. క్రీజ్‌లో లబుషేన్(53 బ్యాటింగ్), జేమ్స్ పాటినసన్(2 బ్యాటింగ్)లు ఉన్నారు. (ఇక్కడ చదవండి: ఇంగ్లండ్ 67కే ఆలౌట్)