Horoscope Today: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు | Today Horoscope 17 11 2022 | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

Published Thu, Nov 17 2022 6:48 AM | Last Updated on Thu, Nov 17 2022 6:56 AM

Today Horoscope 17 11 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.నవమి తె.5.40 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి దశమి, నక్షత్రం: మఖ సా.6.41 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.3.16 నుండి 5.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.36 వరకు, తదుపరి ప.2.20 నుండి 3.05 వరకు,

అమృతఘడియలు: రా.3.13 నుండి 5.01 వరకు;
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;

సూర్యోదయం 6.09;
సూర్యాస్తమయం 5.21. 

మేషం: పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు.  పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. 

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కన్య: శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. 

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా కొనసాగుతాయి.

మకరం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. చిత్రమైన సంఘటనలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు. దైవదర్శనాలు చేసుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement