ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నియమితుడయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్రాహం థోర్ప్ స్థానంలో ట్రాట్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది మేలో తీవ్ర అస్వస్థతకు గురైన గ్రాహం థోర్ప్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఐర్లాండ్ సిరిస్‌తో ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన కోచ్‌గా ట్రాట్ ప్రయాణం మొదలుకానుంది.
ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ట్రాట్.. ఇంగ్లండ్‌కు 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ట్రాట్ 127 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 6792 పరుగులు సాధించాడు. అతడి కెరీర్‌లో 13 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు ఉన్నాయి. ట్రాట్ గతంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు మెంటార్‌గా, ఇంగ్లండ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.
చదవండి: ZIM vs BAN: జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..!
Comments
Please login to add a commentAdd a comment