మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం | Rowdy Sheeter Halchal in Warangal City | Sakshi
Sakshi News home page

మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం

Published Fri, Oct 3 2014 2:39 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం - Sakshi

మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం

వరంగల్: వరంగల్ నగరంలో రౌడీషీటర్ ప్రమోద్ శుక్రవారం హల్చల్ సృష్టించాడు. స్థానిక శంబునిపేటలోని బార్లో ప్రమోద్ అతడి అనుచరులతో వీరంగం సృష్టించాడు. బార్లోనే ఉన్న మందుబాబులు ఇది పద్దతి కాదంటూ ప్రమోద్తోపాటు అతడి అనుచరులను హెచ్చరించారు. మమ్మల్నే హెచ్చరిస్తారా అంటూ వారిపై అక్కడే ఉన్న మందు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రమోద్ బృందం అక్కడి నుంచి పరారైంది.

ఈ ఘటనపై బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బార్ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రమోద్తోపాటు అతడి బృందం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement