pramodh
-
మూత్రవిసర్జన చేస్తుండగా ఫొటో తీసిన మహిళ.. యువకుడు తీవ్ర నిర్ణయం..
కామారెడ్డి: ఓ మహిళ చేసిన ఆరోపణలతో అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో యువకుడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన మేతరి ప్రమోద్(18) ఈనెల 4న తన ఇంటికి కొద్ది దూరంలో మూత్ర విసర్జన చేశాడు. సమీపంలో నివసించే ఓ మహిళ తన సెల్ఫోన్లో ఫొటోతీసి.. రోజు నన్ను చూస్తూ.. నా ఎదుటే మూత్ర విసర్జన చేస్తున్నాడంటూ ఆ ఫొటోను భర్తకు చూపించింది. దీంతో ఆయన కుల పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. తాను ఉద్దేశపూర్వకంగా అక్కడ మూత్ర విసర్జన చేయలేదని, వర్షం పడుతుండడంతో అలా చేశానని ప్రమోద్ చెప్పినా వినకుండా తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రమోద్.. అదే రోజు ఆర్మూర్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లి ఆర్మూర్ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి నిప్పంటించుకున్నాడు. ప్రమోద్ స్నేహితులు ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపి సంఘటన స్థలానికి వెళ్లేసరికి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆర్మూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రమోద్ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా ప్రమోద్ చివరివాడు. తల్లి చిన్నప్పుడే మృతిచెందగా నాన్నే పెంచాడు. ప్రమోద్ ఇంటర్ పూర్తిచేసి ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయమై ఆర్మూర్ సీఐ సురేష్‌బాబును వివరణ కోరగా కేసు నమోదు చేశామని, మాక్లూర్‌కు కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!
కోదాడ : ఆంధ్రాలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కోదాడలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) మందుల సరఫరా కుంభకోణానికి పాల్పడిన వారిలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో అక్కడి ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. (అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఆంధ్రా ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేశారు. అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.(‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..’) -
సొసైటీ అధ్యక్షుడి అరెస్టు
భువనేశ్వర్: లైంగిక వేధింపులకు పాల్పడిన నేరం కింద కేంద్రాపడా జిల్లా క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, బిజా జనతా దళ్ రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్ సాహును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ ముగించిన పోలీసులు ఆయనను స్థానిక సబ్–డివిజినల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. న్యాయ స్థానం ఉత్తర్వుల మేరకు నిందితుడిని బరిమూల్ కారాగారానికి తరలించారు. అంతకుముందు ఆదివారం అర్ధరాత్రి కేంద్రాపడా జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంటు బి. గగరిన్ మహంతి నేతృత్వంలో ప్రత్యేక టీమ్ ఆకస్మిక దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. నిందిత ప్రమోద్ సాహుకు వ్యతిరేకంగా కేంద్రాపడా జిల్లా క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమెప్రధాన ఆరోపణ. ఆరోపణను బలపరిచే రీతిలో ఆమెతో నిందితుడి ఫోను సంభాషణ రికార్డులు ఇతరేతర బలమైన ఆధారాల్ని స్థానిక పోలీసులు, మీడియా వర్గాలకు బాధితురాలు బహిరంగపరిచింది. నిందితుడు వివాహేతర సంబంధం కోసం ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు వాపోయింది. ఈ పరిస్థితుల్లో నిందితుడికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం హెచ్చరించింది. నిందితుడితో సంబంధం లేదు: బీజేడీ కార్యాలయం సిబ్బంది పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన కేంద్రాపడా జిల్లా క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ప్రమోద్ సాహు అధికార పక్షం బిజూ జనతా దళ్ ప్రముఖ సభ్యుడిగా ప్రచారమైంది. ఈ ప్రచారం పట్ల బిజూ జనతా దళ్ కార్యాలయం సోమవారం స్పందించింది. నిందిత ప్రమోద్ సాహుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. చాలా రోజుల కిందటే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు బిజూ జనతా దళ్ అధికార ప్రతినిధి లెనిన్ మహంతి ఓ ప్రకటన జారీ చేయడం విశేషం. -
మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం
వరంగల్: వరంగల్ నగరంలో రౌడీషీటర్ ప్రమోద్ శుక్రవారం హల్చల్ సృష్టించాడు. స్థానిక శంబునిపేటలోని బార్లో ప్రమోద్ అతడి అనుచరులతో వీరంగం సృష్టించాడు. బార్లోనే ఉన్న మందుబాబులు ఇది పద్దతి కాదంటూ ప్రమోద్‌తోపాటు అతడి అనుచరులను హెచ్చరించారు. మమ్మల్నే హెచ్చరిస్తారా అంటూ వారిపై అక్కడే ఉన్న మందు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రమోద్ బృందం అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బార్ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రమోద్‌తోపాటు అతడి బృందం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.