నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి.. ఇది ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోగల ఒక ప్రధాన క్యాథలిక్ చర్చి. దీనిని నోట్రే డామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఈ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల కారణంగా చర్చి తీవ్రంగా దెబ్బతింది.
నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి ప్రత్యేక నిర్మాణశైలి, మతపరమైన ప్రాముఖ్యత, చారిత్రక సంఘటనల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పారిస్‌కు తరలి వస్తుంటారు.
నోట్రే డామ్ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై, 14వ శతాబ్దంలో పూర్తయింది. చర్చి గోపురం గోతిక్ శైలిలో నిర్మితమయ్యింది. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈ చర్చి నిర్మాణాన్ని 1163లో బిషప్ మారిస్ డి సుల్లీ చేపట్టారు. 1345లో ఈ చర్చిని ప్రారంభించారు. చర్చి వెలుపలి భాగంలో ఉన్న గార్గోయిల్‌లు ప్రత్యేకమైన శిల్పశైలిలో కనిపిస్తాయి.
నోట్రే డామ్ కాథలిక్ చర్చి క్యాథలిక్ మతాన్ని అనుసరించేవారికి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇక్కడ తరచూ మతపరమైన వేడుకలు జరుగుతుంటాయి.
ఈ చర్చి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చరిత్ర, కళ, సంస్కృతికి చిహ్నంగానూ నిలిచాయి. ఈ చర్చి నెపోలియన్ పట్టాభిషేకం, జోన్ ఆఫ్ ఆర్క్ పునరుద్ధరణలాంటి పలు చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.
2029, ఏప్రిల్ 15న నోట్రే డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చర్చి ప్రధాన గోపురం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం చర్చికి మరమ్మతులు చేపట్టారు. అదే రీతిలో పునర్నిర్మించడానికి సమయం పట్టింది.
ఈ చర్చి విశిష్ట వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యత రీత్యా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. అగ్ని ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక చర్చి ఇప్పుడు తిరిగి అద్భుతమైన రూపంలో కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
Comments
Please login to add a commentAdd a comment