దేవాలయంలో 40 పులుల మృత దేహాలు
Published Wed, Jun 1 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM
బాంకాక్: పవిత్ర దేవాలయం పులుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. థాయ్ లాండ్ వన్యప్రాణి సంరక్షణ అధికారులు వివాదాస్పద బౌద్ధ ఆలయంలో 40 మృతి చెందిన పులి పిల్లలను బుధవారం గుర్తించారు. దక్షిణ బ్యాంకాక్ లోని కంచన్ పురిలో గల యానాసంపన్న ఆలయం టైగర్ టెంపుల్ గా ప్రసిద్థి చెందింది. ఇక్కడ ఆలయం పులుల స్మగ్లింగుకు వేదికగా మారిందని గతకొంత కాలంగా ఆరో్పణలు వస్తున్నాయి.
దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు దేవాలయంలోని కిచెన్లోని ప్రీజర్లో 40 పులి పిల్లల మృత దేహాలను గుర్తించారు. అక్కడ ఉన్న 85 పులులను స్వాధీనం చేసుకున్నట్టు నేషనల్ పార్క్ డైరెక్టర్ తెలిపారు. గత కొంత కాలంగా థాయ్ లాండ్ వన్యప్రాణుల అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. చైనాలో సాంప్రదాయ వైద్యంలో పులుల భాగాలను ఉపయోస్తారు.
Advertisement
Advertisement