
సూట్స్ కోసం ఖరీదైన ఫ్యాబ్రిక్స్ కొనుగోలు చేయడం మాత్రమే కాదు వాటిని అంతే స్టైల్‌గా స్టిచ్ చేయడం కూడా ముఖ్యమే. ఎంత మంచి బ్రాండెడ్ క్లాత్ తీసుకున్నా స్టిచ్చింగ్ కుదరకపోతే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే.
ముఖ్యంగా విభిన్న హోదాల్లో ఉంటూ సూట్స్ ధరించేవారికి ఆ హోదాకు తగ్గట్టు కుట్టు కూడా కుదరాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్స్ తామే స్టిచ్చింగ్ సేవలను అందిస్తున్నాయి. ఈ విషయంలో మరొక అడుగు ముందుకేసిన.. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్.
హైదరాబాద్ నగరవాసులకు ఉచితంగా స్టిచ్చింగ్ సేవల్ని పరిచయం చేస్తూ మేడ్ ఫర్ యూ స్టిచ్డ్ ఫర్ ఫ్రీ పేరిట ఓ కాన్సెప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిటైల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రణవ్ డేవ్ తెలిపారు. ఈ పంధాను మరిన్ని బ్రాండ్స్ అనుసరిస్తే.. వేల రూపాయలు వ్యయమయ్యే స్టిచ్చింగ్ సేవలు ఉచితంగా అందించే పరిస్థితి కనిపిస్తోంది.
(చదవండి: సమ్మర్‌లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!)