సాక్షి, హైదరాబాద్: శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో రష్యాలోని మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి నిలిచింది. పర్వతారోహణ పూర్తిచేసి నగరానికి చేరుకున్న ఆమెను గూడూరి నారాయణరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తున్నానని, ఇప్పటివరకు కిలిమంజారోతో పాటు మరో నాలుగు పర్వతాలు అధిరోహించానని తెలిపింది. నవంబర్‌లో యూకే నుంచి వచ్చిన 20 మంది ఉన్న టీంలో ఐదుగురు చనిపోయారని అయినా పట్టుదల వీడక తాను, తన గైడ్ చతుర్ ముందుకు వెళ్లామన్నారు. తనతో పాటు వచ్చిన చాలామంది వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన)
Comments
Please login to add a commentAdd a comment