మన కళ్ల ముందు కనిపించేవి, మన నిత్య జీవితంలో ఉపయోగించేవి చెడు చేస్తాయని ఊహించం. నష్టం వాటిల్లంత వరకు.. తేరుకోం, తెలుసుకోం. సరదాగా తీసుకుంటాం. ఏం కాదనకుంటాం. జరగకూడనిది జరిగినప్పుడూ గానీ మనకు అవగతం కాదు. టైం బాలేనప్పుడూ తాడే పామై మృత్యువు అవుతుందని పెద్దలు అందుకే అన్నారేమో!. అచ్చం అలాంటి విషాదకర ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సున్నపు రాయి పౌడర్ రోడ్డుకి ఒకపక్కన రాసిలా ఉంది. అక్కడే రొమాల్డో బిటెన్‌కోర్ట్ కుటుంబం నివశిస్తుంది. వాళ్ల ఏడేళ్ల బాబు ఆడుకోవడం కోసం అని బయటకు వచ్చి ఈ సున్నపు రాయి పౌడర్ వద్దకు వచ్చాడు. దాంట్లో దొర్లి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. అతడి కుటుంబ సభ్యులు ఫోటోలు కూడా తీశారు. సరదాపడుతున్నాడు కదా అని ఏమి అనలేదు. అంతే సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుటుంబసభ్యలుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
వెంటనే ఆ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్ శ్వాసనాళల్లోకి చేరిందని అందువల్లే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. మరొక చిన్నారి ఇలా మృత్యువాత పడకూడదనే సదుద్దేశంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు ఆ సున్నపు రాయి వద్ద ఆడుకున్న చివరి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వివరించారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి దగ్గరకి పిల్లల్ని వెల్లనీయకుండా చూసుకోండి అని సూచించారు.
సున్నపు రాయి ప్రమాదకరమా..పీల్చితే అంతేనా!
అయితే ఈ సున్నపు రాయి రేణువు సాధారణ ఇసుక రేణువు కంటే వంద రెట్లు చిన్నదని ఈజీగా శ్వాసక్రియా నాళాల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు వైద్యులు. అయితే దీన్ని పిల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, కిడ్నీ వ్యాధి, సిలికోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సున్నపు రాయి రేణువులు ఊపిరితిత్తుల కణజాలంలో చిక్కుకోవడం వల్ల శరీరంపై వాపు, మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఊపిరితిత్తుల వ్యాధికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
(చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment