ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10వేల అడుగుల ఎత్తునుంచి కిందపడి | Audi Italy Boss Fabrizio Longo Dies | Sakshi
Sakshi News home page

ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10వేల అడుగుల ఎత్తునుంచి కిందపడి

Published Tue, Sep 3 2024 6:00 PM | Last Updated on Tue, Sep 3 2024 6:11 PM

Audi Italy Boss Fabrizio Longo Dies

ఆడి ఇటలీ అధినేత 'ఫాబ్రిజియో లాంగో' (Fabrizio Longo) ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు.

ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం. పర్వతాలను ఎక్కే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ ప్రమాదం జరిగింది. తోటి పర్వతారోహకులు ఈ సంఘటనను గమనించి రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు, వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. హెలికాప్టర్ రిట్రీవల్ బృందం తదుపరి పరీక్ష కోసం అతని మృతదేహాన్ని కారిసోలోలోని ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటనే దిశగా విచారణ జరుగుతోంది.

ఫాబ్రిజియో లాంగో 1962లో ఇటలీలోని రిమినిలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్‌ పూర్తి చేసిన ఈయన.. 1987లో ఫియట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆ సమయంలోనే ఆయన తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆ తరువాత 2002లో లాన్సియా బ్రాండ్‌కు నాయకత్వం వహించారు. 2012లో ఆడి కంపెనీలో చేరారు. 2013లో ఇటాలియన్ కార్యకలాపాలకు డైరెక్టర్ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement