కాన్‌బెర్రా: సాధారణం ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను తెలుపడానికి ప్రేమికులంతా భిన్నంగా ఆలోచిస్తూ సాహసాలు చేస్తుంటారు. ఎందుకంటే తన ప్రేమ ప్రపోజల్ ఎదుటి వ్యక్తికి సర్‌ప్రైజింగ్‌తో పాటు, ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం ఉంచాలనుకుంటారు. అలా భిన్నంగా ప్రయత్నించిన ఓ ప్రేమ జంటకు చేదు అనుభవం ఎదురైంది. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి 650 ఎత్తైన కొండపై తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పిన అనంతరం కొద్ది క్షణాలకు ఆ మహిళ కొండపై నుంచి జారి కింద పడింది. అంత ఎత్తైన కొండపై నుంచి పడినప్పటికి ఆమె ప్రాణాలతో బయటపడిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి తను ప్రేమిస్తున్న 32 ఏళ్ల మహిళకు ప్రపోజ్ చేయడానికి కారింథియా కొండపైకి ట్రెక్కింగ్‌కు తీసుకేళ్లాడు. వారు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కిన అనంతరం అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి ప్రేమను అంగీకరించిన ఆ మహిళ ఆకస్మాత్తుగా కొండపై నుంచి కాలు జారి కింద పడిపోయింది. కాగా అక్కడ అంతా మంచు ఉండటంతో సదరు మహిళ ఈ ఘోర ప్రమాదం నుంచి బతికి బట్టకట్టింది.
అయితే ఆమె పడిపోతున్న సమయంలో ఆ యువకుడు ఆమె చేయి పట్టుకుని పైగి లాగే ప్రయత్నం చేస్తూ అతడు కూడా కింద పడిపోయాడు. ఈ క్రమంలో 50 అడుగుల వద్ద అతుడు ఓ కొండ అంచును సపోర్టు చేసుకుని కింద పడిపోకుండా గాల్లో వ్రేలాడాడు. ప్రమాదంలో ఉన్న ఈ జంటను గమనించిన బాటసారులు వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని రక్షించింది. అయితే ఆ వ్యక్తిని మాత్రం హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. సదరు పోలీసుల అధికారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మంచు లేకపోయింటే పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిచించాం. ఈ ప్రమాదంలో అమ్మాయికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అతడి కాలు ఫ్యాక్చర్ అవ్వడంతో వైద్యులు చికిత్స చేసి కట్టుకట్టారు’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment