ఢిల్లీ: ఈ భూమ్మీద మనిషి ఇప్పటికీ అధిరోహించని పర్వతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటిగా మన పొరుగున పాకిస్తాన్‌లోని ముచు ఛిష్ ఉండేది. అయితే అది గతం. ఇప్పుడు దానిని కూడా జయించేశారు.
తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువైంది. కారకోరం రేంజ్‌లోని 7,453 మీటర్ల(24,452 అడుగులు) ఎత్తైన ముచు ఛిష్ పర్వతాన్ని ఎట్టకేలకు అధిరోహించారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం.. ఆరు రోజుల పాటు శ్రమించి ఈ ఘనత సాధించింది. డెనెక్ హక్, రాడోస్లావ్ గ్రోహ్, జరోస్లావ్ బాన్‌స్కీ ఈ బృందంలో ఉన్నారు.
గతంలో ఎందరో పర్వతాహరోహకులు దీనిని అధిరోహించే ప్రయత్నంలో భంగపడ్డారు. కిందటి ఏడాది ఓ బృందం.. 7,200 మీటర్ల దాకా వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కి తిరిగి వచ్చేసింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన పర్వతారోహకులు.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు. అయితే ఈసారి అదే దేశానికే చెందిన బృందం ఒకటి ఎట్టకేలకు ఆ ఘనత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment